Shah Rukh Khan: నయనతార ఇంట షారుక్‌.. అభిమానుల సందడి.. వీడియోలు వైరల్‌

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తన కొత్త సినిమా చిత్రీకరణ కోసం చెన్నై చేరుకున్నారు. షూటింగ్‌ ముగిసిన అనంతరం నటి నయనతార ఇంటికి వెళ్లారు.

Published : 12 Feb 2023 19:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), నయనతార (Nayanthara) జంటగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జవాన్‌’ (Jawan). తన పాత్ర చిత్రీకరణ కోసం షారుక్‌ ఇటీవల చెన్నై చేరుకున్నారు. షూటింగ్‌ ముగిసిన తర్వాత ఆయన నయనతార ఇంటికి వెళ్లి, కాసేపు ముచ్చటించారు. అనంతరం, హీరో ముంబయికి తిరుగు ప్రయాణమవుతుండగా అభిమానులు సెల్ఫీ కోసం పోటీపడ్డారు. ఎట్టకేలకు తన కారు వద్దకు చేరుకున్న షారుక్‌.. నయన్‌కు పెక్‌ పెడుతూ గుడ్‌బై చెప్పారు. సంబంధిత వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా గతేడాది నవంబరులో చెన్నైలో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబయిలో జరగబోయే తదుపరి షెడ్యూల్‌లో నయనతార పాల్గొంటారని సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌ 2న విడుదలకానుంది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని