Shahrukh Khan: మహేశ్.. నీతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నా: షారుఖ్‌

షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) - మహేశ్‌ బాబు (Mahesh Babu) మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ తాజాగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘జవాన్‌’ (Jawan) చిత్రాన్ని ఉద్దేశిస్తూ వీరిద్దరూ ట్వీట్స్‌ చేసుకున్నారు.

Updated : 06 Sep 2023 13:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్‌’ (Jawan) చిత్రాన్ని కుటుంబంతో కలిసి తాను చూడాలనుకుంటున్నట్లు నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) తాజాగా ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకోవాలంటూ ఆయన కోరుకున్నారు. దీనిపై షారుఖ్‌ స్పందిస్తూ మహేశ్‌తో కలిసి తాను కూడా మూవీ టైమ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

‘‘థ్యాంక్యూ సో మచ్‌ మై ఫ్రెండ్‌. ‘జవాన్‌’ నీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నువ్వు ఎప్పుడు ఈ సినిమా చూడాలనుకుంటున్నావో చెబితే.. నేనూ నీతో కలిసి సినిమాకి వస్తా. నీకు, నీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు’’ అని షారుఖ్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది సీని ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ విషయంలో నయన్‌కు తొలి చిత్రం.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డు.. ‘జవాన్‌’ విశేషాలివీ!

షారుఖ్‌ - మహేశ్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. గతంలో ‘బ్రహ్మోత్సవం’ సెట్‌కి షారుఖ్‌ ప్రత్యేకంగా వెళ్లి మహేశ్‌ను కలిశారు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.

ఇక, జవాన్‌ విషయానికి వస్తే,.. అట్లీ - షారుఖ్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రమిది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమైంది. ఇందులో షారుఖ్‌ దాదాపు 7 గెటెప్స్‌లో కనిపించనున్నారు. నయనతార కథానాయిక. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, విజయ్‌, అల్లు అర్జున్‌ అతిథి పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో సంజయ్‌ దత్‌ (హిందీ వెర్షన్‌) కనిపించనున్నారని తెలుస్తోంది. తమిళ వెర్షన్‌లో అదే పాత్రను విజయ్‌.. తెలుగులో అల్లు అర్జున్‌ పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని