సామ్ ‌జిమ్‌.. బాస్‌ ఉంటే గ్రేస్‌

ఆయనను దగ్గరగా చూసి చాలా ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఆయన ఒక యువకుడిలాగే కనిపిస్తుంటారు అని.. సూపర్‌స్టార్‌ కృష్ణను ఉద్దేశిస్తూ నటుడు సుధీర్‌బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. జిమ్‌లో భాగంగా బరువులు ఎత్తుతున్న ఫొటోను సమంత అభిమానులతో..

Updated : 20 Nov 2020 15:44 IST

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: 
* చాలా ఏళ్లుగా ఆయనను దగ్గర్నుంచి చూస్తున్నా.. ఇప్పటికీ ప్రతి నిమిషం ఆయనతో ఉంటే తొలిసారి కలిసినంత ఆనందంగానే ఉంటుంది అంటూ 
సూపర్‌స్టార్‌ కృష్ణను ఉద్దేశిస్తూ నటుడు సుధీర్‌బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. 
* జిమ్‌లో భాగంగా బరువులు ఎత్తుతున్న ఫొటోను సమంత అభిమానులతో పంచుకుంది. కాగా.. ఆ పోస్టుకు నటి రుహానిశర్మతో పాటు గాయని చిన్మయి కూడా గ్రేట్‌ అంటూ స్పందించారు. 
* మీరెక్కడ ఉంటే అందరూ అక్కడికే ఆకర్షితులవుతారు. అక్కడ వెలుగులు విరజిమ్ముతాయంటూ మెగా బ్రదర్‌ నాగబాబు తన సోదరుడు చిరంజీవి ఫొటోను పోస్టు చేశారు. ఆ చిత్రంలో వెనకాల బాస్‌ అనే అక్షరాలతో చిరూ సూపర్‌ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. 
* విమానాశ్రయంలో ఎన్టీఆర్‌ తన కుటుంబంతో కలిసి వస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నాయి.
* సెట్స్‌లోకి వచ్చానంటూ.. నటుడు సోనూసూద్‌ ఓ చిన్న వీడియో పోస్టు చేశారు. అందులో సోనూ.. చేతివేళ్లతో తుపాకీ తిప్పుతూ స్టైల్‌గా నడుస్తూ కనిపించారు.

* నటుడు అంటే దేవుడి దృష్టిలో మూర్ఖుడా..? వివరణలు ఇవ్వడం మానేయండి.. నటించడం మొదలుపెట్టండి అని బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
* ప్రకృతి చేస్తున్న సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తున్నానంటూ హీరోయిన్‌ రాశీఖన్నా ఓ ఫొటోను పోస్టు చేసింది.  

* సముద్రాన్ని ఆస్వాదించండి.. మీమనసుకు స్వేచ్ఛనివ్వండి అంటూ రకూల్‌ప్రీత్‌సింగ్‌ ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
* ఆఫీసులో పిజ్జా తింటున్నా. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు.. కానీ భోజనంపై ఉన్న ప్రేమతో రూల్స్‌ను బ్రేక్‌ చేస్తున్నాను. నిజానికి నా ఆహార నియమాలు మారాలి అని రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పోస్టు చేసింది.

 

 

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని