Sriya Reddy: ‘రాధా రమ’.. నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు: శ్రియారెడ్డి

‘సలార్‌’(Salaar)లో యాక్ట్‌ చేయడంపై నటి శ్రియారెడ్డి (Shriya Reddy) ఆనందం వ్యక్తం చేశారు. రాధా రమ పాత్రకు తనను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.

Updated : 22 Dec 2023 20:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సలార్‌’ (Salaar)లో కీలకమైన రాధా రమ పాత్రకు తనను ఎంచుకున్నందుకు  దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel)కు నటి శ్రియా రెడ్డి (Shriya Reddy) ధన్యవాదాలు చెప్పారు. తనకు చెప్పినట్టుగానే స్క్రీన్‌పైకి రాధారమ పాత్రను తీసుకువచ్చారన్నారు. షూట్‌లో భాగంగా దర్శకుడితో దిగిన ఓ ఫొటోని షేర్‌ చేసిన ఆమె.. ‘‘ప్రశాంత్‌.. రాధారమ పాత్రను స్క్రీన్‌పై ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించావు. ‘రాధారమ ఎప్పుడూ నవ్వదు’ అంటూ ఈ పాత్రను ఉద్దేశించి సెట్‌లో నువ్వు చెప్పిన మాటలు నాకింకా గుర్తు ఉన్నాయి. ఒక మహిళ కోసం ఇలాంటి అద్భుతమైన పాత్రను రూపొందించడానికి నిజంగా ధైర్యం కావాలి. ఈ పాత్రతో నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి నన్ను బయటకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు’’ అని ఆమె రాసుకొచ్చారు. దీనిని చూసిన నెటిజన్లు.. ‘సలార్‌’లో మీ యాక్టింగ్‌ బాగుందంటూ పోస్టులు పెడుతున్నారు.

Salaar Review: రివ్యూ: సలార్‌.. ప్రభాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన శ్రియారెడ్డి.. ‘అప్పుడప్పుడు’ అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. విశాల్‌ హీరోగా నటించిన ‘పొగరు’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించారు. ఆ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. శుక్రవారం విడుదలైన ‘సలార్‌’ శ్రియారెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సోదరిగా రాధారమ పాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని