Athiya-Rahul: కేఎల్‌ రాహుల్‌ నాకు అల్లుడు కాదు కుమారుడు.. ఎందుకంటే :సునీల్‌ శెట్టి

కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)ని తన సొంత కొడుకుగా భావిస్తానని బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి (Suniel Shetty)అన్నారు. రాహుల్‌కు తాను పెద్ద అభిమానినని చెప్పారు.

Published : 13 Feb 2023 13:14 IST

ముంబయి: బాలీవుడ్‌ సినీప్రియులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నటుల్లో సునీల్‌ శెట్టి (Suniel Shetty) ఒకరు. తాజాగా ‘ధారావి బ్యాంక్‌’ (the series Dharavi Bank) సిరీస్‌లో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ నటుడు సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. దానికి కారణం ఇటీవలే తన గారాల కూతురు అథియా శెట్టి (Athiya Shetty) ప్రముఖ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడమే. వీరి వివాహంలో సందడి చేసిన సునీల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేఎల్‌ రాహుల్‌ అంటే తనకు ఎంత ప్రేమో చెప్పారు. 

‘‘రాహుల్‌ నాకు అల్లుడు. నేను మాత్రం అతడిని కుమారుడిలా భావిస్తా. ఈరోజు నా కుమార్తెతో పెళ్లి అయింది కాబట్టి నేను తనకు మామగారిని అయ్యాను. కానీ, దానికంటే ముందు నేను అతడికి అభిమానిని. తన ఆటను, టాలెంట్‌ను ఇష్టపడే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఒకసారి రాహుల్‌ ఆట చూసి ఎంతో ముచ్చటపడ్డా. కష్టపడే తత్వం ఉన్న వాళ్లను చూసి నేనెంతో గర్వపడతా. అందుకే రాహుల్‌కు అభిమానినయ్యా. తన ప్రతికదలికను నేను ఇష్టపడతా’’ అని చెప్పుకొచ్చారు.

రాహుల్‌ - అథియా కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో ఈ జోడీ జనవరి 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక వీరి రిసెప్షన్‌ గురించి మాట్లాడిన సునీల్‌ శెట్టి ఐపీఎల్‌ తర్వాత ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని