Suriya: కంటతడి పెట్టిన నటుడు సూర్య.. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ హఠాన్మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తమిళ నటుడు సూర్య అన్నారు. శుక్రవారం బెంగళూరులోని పునీత్ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించిన ఆయన.. భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 05 Nov 2021 16:05 IST

కన్నడ నటుడు పునీత్‌రాజ్‌ స్మారక చిహ్నం వద్ద భావోద్వేగం

బెంగళూరు: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ హఠాన్మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తమిళ నటుడు సూర్య అన్నారు. శుక్రవారం బెంగళూరులోని పునీత్ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించిన ఆయన.. భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. ఇలా జరిగి ఉండకూడదు. పునీత్‌ ఇక లేరన్న విషయాన్ని ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నా.. మా కుటుంబాల మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. మా నాన్న(శివ కుమార్‌).. రాజ్‌కుమార్‌ కుటుంబంతో చిరస్మరణీయమైన సమయాన్ని గడిపారు. పునీత్‌ అమ్మగారు.. మా అమ్మ  ఇద్దరూ గర్భిణులుగా ఉన్న సమయంలో తొలిసారి కలిశారట. అలా మేము అమ్మ కడుపులో ఉండగానే కలుసుకున్నాం. వాళ్లు కూడా పునీత్ చనిపోయాడన్న విషయాన్ని అంగీకరించలేకపోతున్నారు. పునీత్‌.. ఏ ఫొటోల్లో, వీడియోల్లో కనిపించినా నవ్వుతూ కనిపించే చక్కటి స్మైలింగ్‌ ఫేస్‌. తన జీవితంలో చేసిన మంచి విషయాల గురించి విన్నా.. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. తన కుటుంబ సభ్యులు, అభిమానులకు మనోస్థైర్యం చేకూరాలని కోరుకుంటున్నా. వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కచ్చితంగా నేను పునీత్‌ను మిస్‌ అవుతా’’ అని అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని