Sushanth: పోలీస్‌ అధికారిగా..!

రవితేజ కథానాయకుడిగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అను   ఇమ్మానుయేల్‌, మేఘ ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ సంస్థతో కలిసి అభిషేక్‌ నామా

Updated : 19 Mar 2022 08:57 IST

వితేజ కథానాయకుడిగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అను ఇమ్మానుయేల్‌, మేఘ ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ సంస్థతో కలిసి అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజతోపాటు యువ కథానాయకుడు సుశాంత్‌ ఓ కీలకపాత్రని పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమాలోని లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘‘రవితేజ న్యాయవాదిగా నటిస్తున్న చిత్రమిది. సుశాంత్‌ ఓ కొత్త రకమైన గెటప్‌తో విభిన్నమైన పాత్రని పోషిస్తున్నారు. రచయితగా మంచి చిత్రాలకి పనిచేసిన శ్రీకాంత్‌ విస్సా ఈ చిత్రం కోసం కొత్త తరహా కథని అందించార’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌, కూర్పు: శ్రీకాంత్‌.

వెబ్‌సిరీస్‌లో...: ఓటీటీ వేదికపై సందడి చేయనున్నాడు సుశాంత్‌. ఆయన ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. జీ5 కోసం రూపొందుతున్న ఆ సిరీస్‌కి లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. కొల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రవీణ్‌ కొల్లా నిర్మిస్తున్నారు. ఓటీటీ మాధ్యమాలకి లభిస్తున్న ఆదరణ దృష్ట్యా పలువురు కథానాయకులు వెబ్‌ సిరీస్‌ల్లోనూ, వెబ్‌ సినిమాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తో సుశాంత్‌ వెబ్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టైంది. ఇందులో ఆనొక పోలీస్‌ అధికారిగా కనిపిస్తారని పోస్టర్‌ని బట్టి స్పష్టమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని