Tamanna: నీరజ్‌ పాండే దర్శకత్వంలో తమన్నా

ఈ ఏడాదితో చిత్రపరిశ్రమలో 19ఏళ్ల తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది కథానాయిక తమన్నా. దక్షిణాది చిత్రాలే కాకుండా బాలీవుడ్‌లోనూ నటించి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

Updated : 07 Mar 2024 09:40 IST

ఏడాదితో చిత్రపరిశ్రమలో 19ఏళ్ల తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది కథానాయిక తమన్నా. దక్షిణాది చిత్రాలే కాకుండా బాలీవుడ్‌లోనూ నటించి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. హిందీ చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ భామ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పుడు మరో ప్రాజెక్టులో తమన్నా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ‘నీరజ్‌ పాండే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇంకా ప్రాజెక్టు పేరు ఖరారు కాలేదు. ఇతర తారాగణం వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. గత నెలలోనే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది’ అంటూ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని