Jamuna: అలనాటి నటి జమున బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ..!
జమున(Jamuna) జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించనున్నారట. ఇందులో జమున పాత్ర కోసం తమన్నా(Tamannaah)ను ఎంపిక చేసినట్లు సమాచారం.
హైదరాబాద్: తెలుగుతో పాటు ఎన్నో దక్షిణాది భాషల్లో నటించి మెప్పించిన అలనాటి అందాల తార జమున (Jamuna) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. మహానటి సావిత్రి తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జమున బయోపిక్‌ను తీసే ఆలోచనలో ఉందట తమిళ ఇండస్ట్రీ. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఓ స్టార్ డైరెక్టర్ ఈ బయోపిక్(Jamuna biopic)కు సంబంధించిన పనులు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఆసక్తికర విషయమేమిటంటే.. జమున పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah)ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సావిత్రి బయోపిక్‌లో నటించి కీర్తి సురేశ్ (Keerthy Suresh) సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఎన్నో ఆఫర్లు సొంతం చేసుకుంది. మరి గడుసైన పాత్రలు, ముఖ్యంగా సత్యభామ పాత్రకు జీవంపోసిన జమున పాత్రలో తమన్నా ఎలా నటిస్తుందా.. అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఇక ప్రస్తుతం తమన్నా అగ్ర హీరో చిరంజీవి(Chiranjeevi) సరసన ‘భోళా శంకర్’ (Bholaa Shankar)లో నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ సొంతం చేసుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానాంశంగా రానున్న ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Dhruv Chopper Fleet: ధ్రువ్ హెలికాప్టర్లకు క్లియరెన్స్ పునరుద్ధరించిన సైన్యం
-
General News
CM KCR: విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
India News
ఇకపై OTTలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు.. కేంద్రం కీలక నిర్ణయం
-
World News
South Korea: కిమ్ ఉపగ్రహ ప్రయోగం.. దక్షిణ కొరియాపై ప్రజల ఆగ్రహం..!
-
India News
NIA: ప్రధాని హత్యకు కుట్రకేసులో ఎన్ఐఏ దాడులు..!