Tamannaah: తమన్నా ‘డేరింగ్‌ పార్ట్‌నర్‌’

ఆకట్టుకునే పాత్రలు...అలరించే ప్రత్యేక పాటలు..ఇలా ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటుంది అందాల తార తమన్నా. తాజాగా ఆమె మరో సిరీస్‌తో అభిమానుల ముందుకు రానుంది.

Updated : 21 Mar 2024 11:04 IST

కట్టుకునే పాత్రలు...అలరించే ప్రత్యేక పాటలు..ఇలా ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటుంది అందాల తార తమన్నా. తాజాగా ఆమె మరో సిరీస్‌తో అభిమానుల ముందుకు రానుంది. ఇద్దరు స్నేహితులు ఆల్కహాల్‌ స్టార్టప్‌తో భాగస్వాములుగా మారి సాహసోపేతమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. పురుష ఆదిపత్యం ఉన్న ఈ పరిశ్రమలో వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారనే కథనంతో రానుంది ‘డేరింగ్‌ పార్ట్‌నర్‌’. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో కనిపించనుంది. అర్చిత్‌ కుమార్‌, నిషాంత్‌ నాయక్‌ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ని కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన ఓ వేడుకలో ఈ ప్రాజెక్టును ప్రకటించింది సిరీస్‌ బృందం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని