teja sajja: ‘హనుమాన్‌’ కోసం 70 ప్రాజెక్ట్‌లు వదులుకున్నా..: తేజ సజ్జా

‘హనుమాన్‌’ చేసే సమయంలో తన వద్దకు వచ్చిన 70 ప్రాజెక్ట్‌లు వదులుకున్నట్లు యంగ్‌ హీరో తేజ సజ్జా చెప్పారు.

Published : 05 Feb 2024 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జా - ప్రశాంత్‌ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్‌’ సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇందులో హనుమంతు పాత్రలో తేజ (Teja Sajja) తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్నన్ని రోజులు మరే ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదని తాజాగా ఈ యంగ్‌ హీరో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘హనుమాన్‌’ (Hanuman) కోసం నాకు 25 సార్లు లుక్‌ టెస్ట్‌ చేశారు. ఈ మూవీలో స్టంట్స్ అన్నీ నేను స్వయంగా చేశాను. నీళ్లలో సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమా తీయడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో నేను మరే ఇతర ప్రాజెక్ట్‌లను ఓకే చేయలేదు. పూర్తి శ్రద్ధ ‘హనుమాన్‌’పైనే పెట్టాను. అప్పుడు నా వద్దకు 70-75 సినిమాలు వచ్చాయి. వాటిలో కనీసం 15 మంచి కథలున్నాయి. అయినా, నేను తిరస్కరించాను. ఈ సినిమా విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది. హైదరాబాద్‌లో వేసిన ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూశా. ఆ తర్వాత వసూళ్ల విషయం పట్టించుకోలేదు. కలెక్షన్ల కంటే ప్రేక్షకాదరణ ముఖ్యం’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

గ్రామీ అవార్డుల్లో సత్తా చాటిన శంకర్‌ మహదేవన్‌, జాకిర్‌ హుస్సేన్‌

జనవరి 12 విడుదలైన ‘హనుమాన్‌’ ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకుంది. ‘సంక్రాంతి సీజన్‌లో రిలీజైన సినిమాల జాబితా’లో.. అత్యధిక వసూళ్లు సాధించి నంబరు 1గా నిలిచి 92 ఏళ్ల టాలీవుడ్‌ రికార్డును తిరగరాసింది. దీని విజయంతో జోష్‌లో ఉన్న దర్శకుడు త్వరలోనే ‘జై హనుమాన్‌’ను తీయనున్నారు. అది ‘హనుమాన్‌’కు వందరెట్లు మించిఉంటుందని.. దాన్నొక అంతర్జాతీయ సినిమాలా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని