Grammy Awards: గ్రామీ అవార్డుల్లో సత్తా చాటిన శంకర్‌ మహదేవన్‌, జాకిర్‌ హుస్సేన్‌

గ్రామీ అవార్డుల్లో భారతీయ సంగీత కళాకారులు సత్తా చాటారు.

Updated : 05 Feb 2024 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచదేశాలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొని తమ పాటలతో అలరించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ సంగీత కళాకారులు శంకర్‌ మహదేవన్‌ (Shankar Mahadevan), జాకిర్‌ హుస్సేన్‌లు విజయకేతనం ఎగురవేశారు. 

వీళ్లు కంపోజ్‌ చేసిన ‘దిస్‌ మూమెంట్‌’ ఉత్తమ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ అవార్డును సొంతం చేసుకుంది ( Grammy Awards 2024). ఈ పాటను జాన్‌ మెక్‌లాఫ్లిన్‌ (గిటార్‌), జాకిర్‌ హుస్సేన్‌ (తబలా), శంకర్‌ మహదేవన్‌(సింగర్‌), గణేశ్‌ రాజగోపాలన్‌ (వయోలిన్‌) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్‌ పేరిట కంపోజ్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీని ఎదుర్కొని ‘శక్తి’ విజేతగా నిలవడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ సందర్భంగా శంకర్‌ మహదేవన్‌ మాట్లాడుతూ.. ‘నాకు ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని ఆనందం వ్యక్తం చేశారు.

కొత్త తరానికి స్ఫూర్తి..: మోదీ

గ్రామీ అవార్డు విజేతలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘సంగీతంపై మీకున్న అంకితభావంతో నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లమంది హృదయాలను గెలుచుకున్నారు. మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది. ఈ విజయం మీ కష్టానికి నిదర్శనం. కొత్త తరం కళాకారులు పెద్ద కలలు కనేలా మీరు స్ఫూర్తినింపారు’ అని పోస్ట్‌ పెట్టారు.

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే..!

గ్రామీ 2024 విజేతలు..

  • ఉత్తమ ర్యాప్‌ ఆల్బమ్‌ - మైఖేల్‌ (కిల్లర్‌ మైక్‌)
  • ఉత్తమ ఆఫ్రికన్‌ సంగీత ప్రదర్శన - టైలా (వాటర్)
  • మ్యాజిక్‌ వీడియో - జోనథన్‌ క్లైడ్‌ ఎమ్‌ కూపర్‌ (ఐయామ్‌ ఓన్లీ స్లీపింగ్‌)
  • గ్లోబల్‌ మ్యూజిక్‌ ప్రదర్శన - జాకిర్‌ హుస్సేన్‌, బెలా ఫెక్‌ (పష్టో)
  • గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ - శక్తి (దిస్ మూమెంట్‌)
  • ఉత్తమ క్లాసికల్‌ సోలో వోకల్‌ ఆల్బమ్‌ - జూలియా బూల్లక్‌, సోలోయిస్ట్‌ (వాకింగ్‌ ఇన్‌ ద డార్క్‌)
  • ఉత్తమ రాక్ ఆల్బమ్‌ - పారామోర్‌ (దిస్‌ ఇజ్‌ వై)
  • ఉత్తమ రాక్‌ సాంగ్‌, ప్రదర్శన -  బాయ్‌జెనియస్‌ (నాట్‌ స్ట్రాంగ్‌ ఎనఫ్‌)
  • ఉత్తమ కామెడీ ఆల్బమ్‌ - డేవ్‌ చాపెల్‌ ( వాట్స్ ఇన్ ఏ నేమ్‌)
  • ఉత్తమ కంట్రీ సాంగ్‌, సోలో ప్రదర్శన - క్రిస్‌ స్టేప్లెటన్‌ (వైట్‌ హార్స్‌)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని