Cinema News: ప్రేమిద్దాం.. ఛలో ఛలో

సాయి రోనక్‌, నేహ సోలంకి జంటగా సురేష్‌ శేఖర్‌ రేపల్లె తెరకెక్కించిన చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఉదయ్‌ కిరణ్‌ నిర్మాత. భీమ్స్‌ సిసిరోలియో స్వరాలందించారు. ఈ చిత్ర తొలి గీతాన్ని నటుడు జగపతిబాబు  శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..

Updated : 06 Nov 2021 13:55 IST

సాయి రోనక్‌, నేహ సోలంకి జంటగా సురేష్‌ శేఖర్‌ రేపల్లె తెరకెక్కించిన చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఉదయ్‌ కిరణ్‌ నిర్మాత. భీమ్స్‌ సిసిరోలియో స్వరాలందించారు. ఈ చిత్ర తొలి గీతాన్ని నటుడు జగపతిబాబు  శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఎంబీఏ, ఎంసీఏలు చదవలేకపోతివి’ అంటూ సాగే ఈ తొలి పాట యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది. దీనికి దేవ్‌ పవార్‌ సాహిత్యం అందించారు. వెంకట్‌ దీప్‌ నృత్యరీతులు   సమకూర్చారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘కొత్తదనం నిండిన కథతో రూపొందుతోన్న చిత్రమిది. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు హీరో సాయిరోనక్‌. ‘‘సెన్సార్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో థియేటర్లలో సినిమా విడుదల చేస్తామ’’న్నారు నిర్మాత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని