Chay Sam: సమంత-చైతన్య విడిపోవడానికి కారణమిదే: మాధవీలత

సమంత-నాగచైతన్య విడిపోవడంపై సోషల్‌మీడియాలో వస్తోన్న వరుస కామెంట్లపై తాజాగా నటి మాధవీలత స్పందించారు. వ్యక్తిగత కారణాల వల్లే వాళ్లిద్దరూ విడిపోయారంటూ ఆమె షాకింగ్‌ కామెంట్లు చేశారు....

Published : 07 Oct 2021 01:01 IST

సభ్యత్వం తీసుకుంటే.. ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేదాన్ని..!

హైదరాబాద్‌: సమంత-నాగచైతన్య విడిపోవడంపై సోషల్‌మీడియాలో వస్తోన్న వరుస కామెంట్లపై తాజాగా నటి మాధవీలత స్పందించారు. వ్యక్తిగత కారణాల వల్లే వాళ్లిద్దరూ విడిపోయారంటూ ఆమె షాకింగ్‌ కామెంట్లు చేశారు. ఈ మేరకు తాజాగా ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన మాధవి.. ‘సామ్‌-చై విడిపోవడం గురించి చాలామంది చాలారకాలుగా మాట్లాడుకుంటున్నారు. సినిమావాళ్లు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమని, పెళ్లాయ్యాక కూడా ఆమె గ్లామర్‌ రోల్స్‌ చేయడమే కారణమని చెప్పుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, ఇప్పుడున్న రోజుల్లో విడాకులు తీసుకోవడం సాధారణ విషయమై పోయింది. కానీ సినిమా వాళ్ల కంటే కూడా బయటవాళ్లే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. అలాగే, పెళ్లాయ్యాక ఇంట్లో వాళ్ల అనుమతితోనే ఆమె సినిమాల్లో నటించింది. గ్లామర్‌ రోల్స్‌ చేసింది. పెళ్లి, కుటుంబం, పిల్లలు.. ఇలా ప్రతి విషయంపై ఆమెకు ఎంతో నమ్మకం ఉంది.  మీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఆమె ఎంతో మంచి మనిషి. షాపింగ్‌ మాల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు వచ్చే డబ్బుని ప్రత్యూష ఫౌండేషన్‌ కోసమే ఖర్చు చేసింది. నటనకు కోట్లలో పారితోషికం వచ్చినా ఆమెకు పాకెట్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం వల్లే ఆమె చివరికి విడిపోవడానికి అంగీకారం తెలిపింది’ అని కీలకవ్యాఖ్యలు చేశారు.

గట్టిపోటీ ఇచ్చేదాన్ని..: 

అనంతరం ఆమె ‘మా’ ఎన్నికల గురించి స్పందిస్తూ.. సభ్యత్వం ఉండుంటే తప్పకుండా ఎన్నికల్లో నిలబడేదాన్ని అని చెప్పారు. ‘‘మా’లో సభ్యత్వం తీసుకోలేదు కానీ, తీసుకుని ఉంటే 1000శాతం ఎన్నికల్లో పోటీ చేసేదాన్ని. గెలుపు ఓటములను పక్కన పెడితే మహిళల సమస్యలను తప్పకుండా గట్టిగా వినిపించేదాన్ని. గట్టిపోటీ మాత్రం ఇచ్చేదాన్ని. ఇప్పటివరకూ నాకు ‘మా’తో ఎలాంటి అవసరం రాలేదు.  ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చే ఏడాది ‘మా’లో సభ్యత్వం తీసుకుంటా’ అని మాధవీ లత వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని