Anasuya: కేటీఆర్‌ సర్‌.. ఇదెక్కడి న్యాయం చెప్పండి: అనసూయ

చిన్నారుల భద్రత విషయంలో కొన్ని పాఠశాలలు అనుసరిస్తున్న తీరుపై నటి, ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ అసహనం వ్యక్తం చేశారు. పిల్లల్ని తిరిగి స్కూల్స్‌కు పంపించాలంటూ కొన్ని  పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులపై

Updated : 29 Oct 2021 12:16 IST

ట్వీట్‌ చేసిన వ్యాఖ్యాత

హైదరాబాద్‌: చిన్నారుల భద్రత విషయంలో కొన్ని పాఠశాలలు అనుసరిస్తోన్న తీరుపై నటి, ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ అసహనం వ్యక్తం చేశారు. పిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని  పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ఆమె అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్‌ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ శుక్రవారం ఉదయం ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

‘‘కేటీఆర్‌ సర్‌.. కరోనా కారణంగా మొదట మనం లాక్‌డౌన్‌ ఫాలో అయ్యాం. దేశవ్యాప్తంగా కేసులు క్రమంగా తగ్గుతుండటంతో లాక్‌డౌన్‌ని తొలగించారు. దేశంలో వ్యాక్సినేషన్‌ కూడా వేగంగా సాగుతోంది. కానీ, వ్యాక్సిన్‌ తీసుకోని చిన్నారుల పరిస్థితి ఏమిటి? స్కూల్‌లో పిల్లలకు ఏం జరిగినా యాజమాన్యానిది బాధ్యత కాదని చెబుతూ తల్లిదండ్రులు మొదట ఓ అంగీకారపత్రాన్ని తప్పకుండా అందజేయాలని స్కూల్స్‌ ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయి? చెప్పండి సర్‌.. ఇదెక్కడి న్యాయం? ఎప్పటిలాగానే ఈ విషయాన్ని కూడా మీరు సమీక్షిస్తారని భావిస్తున్నాను’’ అని అనసూయ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని