NBK 107: బాలకృష్ణ-గోపీచంద్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ షురూ..!

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభమైంది. ఆయన కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.....

Published : 13 Nov 2021 11:38 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభమైంది. ఆయన కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతోపాటు పలువురు టాలీవుడ్‌ దర్శకులు హాజరై అభినందనలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీశ్‌ శంకర్‌, వి.వి.వినాయక్‌, బుచ్చిబాబు, బాబీతోపాటు మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా ఈ వేడుకలో పాల్గొన్నారు.

బాలయ్య 107వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. పక్కా మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య ఫుల్‌ యంగ్‌ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  బాలకృష్ణకు జోడీగా నటి శ్రుతిహాసన్‌ సందడి చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. మరోవైపు ఇటీవల విడుదలైన ‘క్రాక్‌’ చిత్రంతో గోపీచంద్‌ మలినేని సూపర్‌హిట్‌ని సొంతం చేసుకున్నారు. ఇక, బాలయ్య ప్రస్తుతం ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని