Bigg Boss Telugu 5: దీప్తి మా ఇంటి దగ్గరే ఉంటుంది.. నాకు హగ్‌ ఇస్తే తీసుకెళ్లి ఆమెకు ఇస్తా!

టాప్‌ 8లో ఉన్న కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరికీ బిగ్‌బాస్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌...

Updated : 25 Nov 2021 18:41 IST

హైదరాబాద్‌: టాప్‌ 8లో ఉన్న కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా వారందరికీ బిగ్‌బాస్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌ కుటుంబసభ్యులు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. తొలుత కాజల్‌ కుటుంబసభ్యులు హౌస్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా మానస్‌ తల్లి హౌస్‌కు వచ్చి సభ్యులందరితో సరదాగా మాట్లాడారు. ఇందులో భాగంగా కాజల్‌.. ‘‘టీ పెట్టి ఇవ్వనా.. తాగుతారా?’’ అనగానే.. ‘‘నీకస్సలు వంట రాదు కదా’’ అని మానస్‌ తల్లి పంచ్‌లు వేశారు. దీప్తి తన ఇంటి దగ్గరే ఉంటుందని, తనకు హగ్‌ ఇస్తే తీసుకెళ్లి ఇస్తానని సరదాగా అన్నారు. అనంతరం సిరి తల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెను చూసిన వెంటనే సిరి ఎంతో సంతోషించింది. ‘‘బాగా ఆడుతున్నావు. కానీ, షణ్ముఖ్‌ని నువ్వు కౌగిలించుకోవడం నాకస్సలు నచ్చడం లేదు. గేమ్స్‌ విషయంలో అతను సిరికి బాగా సాయం చేస్తున్నాడు. అందువల్ల సిరి అతనికి బాగా దగ్గరైపోతోంది. అది నాకు నచ్చడం లేదు’’ అని ఆమె చెప్పడంతో అక్కడే ఉన్న షణ్ముఖ్‌ ఒక్కసారిగా కంగుతిన్నారు.

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని