Nani: హృతిక్ రోషన్ నా చిత్రంలో నటిస్తారేమో: నాని
పక్కింటి కుర్రాడిగా కనిపించే నటుల్లో నాని ఒకరు. భావోద్వేగం, కామెడీ ప్రధానంగా సాగే కథల్లో ఎక్కువగా కనిపించిన ఆయన తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్ భరిత చిత్రంతో సందడి చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పక్కింటి కుర్రాడిగా కనిపించే నటుల్లో నాని ఒకరు. భావోద్వేగం, కామెడీ ప్రధానంగా సాగే కథల్లో ఎక్కువగా కనిపించిన ఆయన తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్ భరిత చిత్రంతో సందడి చేయనున్నారు. ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల టైటిల్ గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని.. మీడియా, అభిమానులతో ముచ్చటించారు. ఆ ఆసక్తికర సంగతులివీ..
* మీ ప్రతి చిత్రంలోనూ ఏదో ప్రత్యేకత ఉంటుంది. ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఏం ఆశించవచ్చు?
నాని: ఒకటి కాదు చాలా ఉన్నాయి. విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ఆ వివరాల్ని బయటపెట్టలేను. కానీ, ఒకటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. సాంకేతికత వినియోగం (ముఖ్యంగా ఫోన్లు) విపరీతంగా పెరిగిన ప్రస్తుత రోజుల్లో సినిమాని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్నాం. గతంలో ఎలా అయితే కథలో లీనమయ్యేవాళ్లమో ‘శ్యామ్ సింగరాయ్’తో అలా కనెక్ట్ అవుతాం. ఏ పని ఉన్నా పక్కన పెట్టేస్తాం.
* ‘శ్యామ్ సింగరాయ్’.. పాన్ ఇండియా స్థాయి చిత్రం అనిపిస్తుంది. హిందీలో విడుదలవుతుందా?
నాని: మీ దృష్టిలో పాన్ ఇండియా ఫిల్మ్ అంటే భారీ బడ్జెట్ అయి ఉండొచ్చు. కథే.. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్తుందనేది నా అభిప్రాయం. అన్ని భాషల వారు చూడదగ్గదే పాన్ ఇండియా చిత్రం. ‘శ్యామ్ సింగరాయ్’ ఈ కోవకే చెందుతుంది. ‘టక్ జగదీష్’లాంటి చిత్రాలు తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటాయి కాబట్టి మిగతా భాషల్లో చూడకపోవచ్చు. ‘శ్యామ్ సింగరాయ్’కి అలాంటి పరిధులు లేవు. అందుకే దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతానికి హిందీలో విడుదల చేసే ఆలోచన లేదు. ఏమో చూద్దాం! ఏ హృతిక్ రోషనో ఈ చిత్రాన్ని హిందీలో చేసేస్తారనే నమ్మకం ఉంది.
* ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా. వారి ప్రాధాన్యత ఏంటి?
నాని: ఈ సినిమాలోనే కాదు నా ప్రతి చిత్రంలోనూ కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్.. ముగ్గురు పాత్రలకు ఈ సినిమాలో చాలా ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురి, నా పాత్రే కాదు సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కీ ప్రాధాన్యత ఉంటుంది.
* ఈ ముగ్గురిలో మీ అభిమాన నటి ఎవరు?
నాని: ఫలానా అని చెప్పలేను. ముగ్గురూ అభిమాన నటులే. ఒక్కో సన్నివేశంలో ఒక్కొక్కరు ఆకట్టుకున్నారు.
* ‘శ్యామ్ సింగరాయ్’ లుక్ కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
నాని: నటులు కేర్ తీసుకున్నంత మాత్రాన లుక్ అద్భుతంగా రాదు. స్క్రిప్టు వల్లే అది సాధ్యమవుతుంది. దర్శకులు, రచయితలు, సాంకేతిక బృందం కలిసి పాత్రని తీర్చిదిద్దితే లుక్‌లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. ‘శ్యామ్ సింగరాయ్’ లుక్ బాగుందంటే కారణం 24 విభాగాల కష్టమే.
* ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. శ్యామ్ సింగరాయ్, వాసు.. ఈ రెండింటిలో ఏ పాత్ర సవాలుగా అనిపించింది?
నాని: రెండింటికీ ఒకేలా కష్టపడ్డా. కానీ, శ్యామ్ సింగరాయ్ మనసుకి దగ్గరైంది. ఈ పాత్ర చాలా కొత్తగా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
* పోస్టర్లు చూస్తుంటే సత్యజిత్ రే జీవిత కథ ఆధారంగా వస్తోన్న చిత్రమనిపిస్తుంది..!
నాని: మీరు అనుకున్నట్టు ఏం కాదు. కానీ, సత్యజిత్ రే గారితో పనిచేసిన కొందరు నటులు ఈ చిత్రంలో కనిపిస్తారు.
* మళ్లీ స్పోర్ట్స్ డ్రామాలో ఎప్పుడు నటిస్తారు?
నాని: ఇప్పటికే రెండు (భీమిలి: కబడ్డీ జట్టు, జెర్సీ) సినిమాలు చేశాను. స్పోర్ట్స్ డ్రామాలో మరో చిత్రం చేశానంటే ఇలాంటి చిత్రాలకి అంబాసిడర్ అయిపోతానేమోనని బ్రేక్ ఇస్తున్నా. ఇంకో ఐదారేళ్లు అయితే ప్లేయర్‌గా కాదు కోచ్ పాత్రల్లో నటించాల్సి వస్తుంది (నవ్వులు).
* మీ నుంచి భక్తి ప్రధాన చిత్రాలు, బయోపిక్స్ వచ్చే అవకాశం ఉందా?
నాని: హా. తప్పకుండా.
* చిన్నపిల్లల కోసం సినిమా ఎప్పుడు చేస్తారు?
నాని: చిన్నపిల్లలతో నేను నటించినట్టుగా యువ నటుల్లో ఎవరూ నటించి ఉండరు. ‘ఈగ’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తదితర చిత్రాల్లో బాల నటులు కనిపించారు. పిల్లలు ఎక్కువగా ఉండే చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తా (నవ్వులు).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్‌తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్‌బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?