Social Look: అదాశర్మ ‘పైనాపిల్‌ పాయసం’.. ఫొటో తీయనందుకు అనుపమ శిక్ష

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 26 Oct 2021 01:44 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* పైనాపిల్‌ పాయసం చేసిందట అదాశర్మ. ‘రుచికరమైన ఈ వంటకి కావాల్సిన పదార్థాలు ఇవీ’ అంటూ జాబితాని రాసుకొచ్చింది.

* ‘ముక్కు అవినాష్‌’ వివాహ వేడుకలో దిగిన ఫొటోల్ని షేర్‌ చేసింది శ్రీముఖి.

* విజయ్‌ హీరోగా, స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బిగిల్‌’ (విజిల్‌). ఈ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రీకరణ జ్ఞాపకాల్ని నెమరువేసుకుంది అమృత అయ్యర్‌.

* తనని ఫొటో తీయకపోతే శిక్ష ఎలా ఉంటుందో చూపించింది అనుపమ పరమేశ్వరన్‌. ఓ ఫొటోలో.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ తలని పట్టుకుని కనిపించిందామె. ‘నన్ను ఫొటో తీయనన్నప్పుడు ఇలానే చేయాలనిపిస్తుంది’ అని సరదా పోస్ట్‌ పెట్టింది. ఇలా మరికొందరు సినిమా తారలు పంచుకున్న విశేషాలేంటో చూసేయండి..




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని