bigg boss telugu 5: విశ్వ ఎలిమినేట్‌.. ప్రస్తుతం హౌస్‌లో టాప్‌ 1 TO 10 వీరే!

బిగ్‌బాస్‌(Bigg boss) నుంచి విశ్వ(Viswa) ఎలిమినేట్‌ అయ్యాడు. హౌస్‌లోకి వచ్చిన నాటి నుంచి మంచి గేమర్‌గా,

Published : 08 Nov 2021 01:28 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ (Bigg boss) నుంచి విశ్వ(Viswa) ఎలిమినేట్‌ అయ్యాడు. హౌస్‌లోకి వచ్చిన నాటి నుంచి మంచి గేమర్‌గా, సంచాలకుడిగా, కెప్టెన్‌గా చక్కని ప్రతిభ కనబరిచాడు. ఇక టాస్క్‌ల విషయంలో ఎప్పుడూ ముందుండేవాడు. ఈవారం కెప్టెన్‌ షణ్ముఖ్‌, అనీ మాస్టర్‌, మానస్‌లు సేఫ్‌ అవ్వగా,  శ్రీరామ్‌, రవి, సన్నీ, జస్వంత్‌ ,ప్రియాంక, విశ్వ, కాజల్‌, సిరి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్‌ అయ్యారు. చివరకు కాజల్‌, విశ్వలు మిగలగా, అతి తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా విశ్వ ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక హౌస్‌లో ఈ వారం వరెస్ట్‌ పెర్ఫార్మర్‌గా కాజల్‌ ఎంపికైంది. బయటకు వెళ్లిన విశ్వ హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న వాళ్లలో ఎవరికి టాప్‌ 1 టు 10 ఇస్తావు అని నాగార్జున అడగ్గా, శ్రీరామ్‌ నెం.1 అని చెప్పాడు. అతడు తన తమ్ముడిలాంటి వాడని అన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడే ఆడాలని బయటకు వచ్చిన తర్వాత ఇక ఏమీ ఉండదని హౌస్‌మేట్స్‌కు సూచించాడు. సన్నీలో ఫైర్‌ తగ్గిందని ఇక మీదట అలా ఉండవద్దని హితవు పలికాడు. విశ్వ చెప్పిన ప్రకారం శ్రీరామ్‌ తర్వాతి స్థానాల్లో రవి, షణ్ముఖ్‌, సన్నీ, మానస్‌, అనీ మాస్టర్‌, జెస్సీ, సిరి, కాజల్‌, ప్రియాంకలు నిలిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని