Ram: తెలుగు వారు సినీ ప్రేమికులు: రామ్‌

‘‘వర్షాలు చూసి ముందు వారియర్‌ చిత్రాన్ని వాయిదా వేయాలనుకున్నాం. కానీ ప్రేక్షకులు వస్తారని గట్టిగా నమ్మాం. తొలిరోజు మా నమ్మకమే నిజమైంది.

Updated : 17 Jul 2022 12:43 IST

‘‘వర్షాలు చూసి ముందు వారియర్‌ చిత్రాన్ని వాయిదా వేయాలనుకున్నాం. కానీ ప్రేక్షకులు వస్తారని గట్టిగా నమ్మాం. తొలిరోజు మా నమ్మకమే నిజమైంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల సినిమా చూడలేకపోయిన వాళ్లంతా ఇప్పుడు చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు రామ్‌ పోతినేని (Ram). ఆయన కథానాయకుడిగా లింగుస్వామి (LinguSamy) తెరకెక్కించిన చిత్రం ‘ది వారియర్‌’ (The Warriorr). శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. కృతి శెట్టి (Krithi Shetty) కథానాయిక. ఆది పినిశెట్టి (Aadhi) ప్రతినాయకుడిగా నటించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. రామ్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా విడుదల సమయంలో చాలా అడ్డంకులొచ్చాయి. మా టీమ్‌ వారియర్స్‌లా నిలబడి విడుదల చేశారు. కొవిడ్‌ వచ్చినా, వర్షాలు వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా ప్రేమికులని ‘ది వారియర్‌’ మరోసారి నిరూపించింది’’ అన్నారు. ‘‘నా పందెం కోడి’, ‘ఆవారా’, ‘రన్‌’ చిత్రాల్లాగే ది వారియర్‌కి గొప్ప ఆదరణ లభించింది. ఈ ఎనర్జీతో మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు లింగుస్వామి. పక్కా కమర్షియల్‌ చిత్రంలో ఏమేం ఉండాలో అవన్నీ ‘ది వారియర్‌’లో ఉన్నాయన్నారు నటుడు ఆది పినిశెట్టి. కార్యక్రమంలో కృతి శెట్టి, శ్రీనివాసా చిట్టూరి, పవన్‌ కుమార్‌, విజయ్‌, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని