Tripti Dimri: ‘యానిమల్‌’కి ముందు,తర్వాత త్రిప్తి ఇన్‌స్టా ఫాలోవర్స్‌ తెలుసా!

‘యానిమల్‌’తో త్రిప్తికి (Tripti Dimri) మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ భారీగా పెరిగారు.

Published : 09 Dec 2023 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్‌’తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri). సందీప్‌ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా ఆమె అలరించారు. దీంతో ప్రస్తుతం నేషనల్‌ క్రష్‌ త్రిప్తినే అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం. ఇక ‘యానిమల్‌’ తర్వాత త్రిప్తి డిమ్రి ఇన్‌స్టా ఫాలోవర్స్‌ భారీగా పెరిగారు.

‘యానిమల్‌’(Animal) సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత త్రిప్తి ఇన్‌స్టా ఫాలోవర్స్ చూసి నెటిజన్లు ఆశ్యర్చపోతున్నారు. నవంబర్‌ చివరి వారంలో ఆమెకు 6లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30లక్షలకు చేరింది. ఇక 2015లో త్రిప్తి ఇన్‌స్టా ఫ్యామిలీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమా విశేషాలతో పాటు రీల్స్‌తోనూ ఆమె సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌లు అన్నింటికి లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి.

చిరంజీవితో సినిమా చేస్తా: సందీప్‌ రెడ్డి వంగా

ఇక ‘యానిమల్‌’లోని శృంగార సన్నివేశం గురించి త్రిప్తి మాట్లాడిన మాటలు కూడా తాజాగా వైరల్‌ అయ్యాయి. ఆ సన్నివేశం సినిమాకు అవసరం కాబట్టే నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. దాన్ని షూట్‌ చేసే సమయంలోనూ దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అతి తక్కువ మంది సమక్షంలో దాన్ని చిత్రీకరించినట్లు త్రిప్తి వెల్లడించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘యానిమల్‌’ ఇప్పటి వరకు రూ.600కోట్లు (గ్రాస్‌) వసూళ్లు చేసింది. రణ్‌బీర్‌ సరసన రష్మిక నటించిన ఈ సినిమాలో బాబీ దేవోల్‌ విలన్‌గా ఆకట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని