Trisha: ఐడెంటిటీ సెట్లో త్రిష

సీనియర్‌ నటి త్రిష చేతి నిండా సినిమాలతో దూసుకెళ్తోంది. ‘లియో’తో భారీ విజయం అందుకున్న తను ‘ఐడెంటిటీ’తో మలయాళ నటుడు టోవినో థామస్‌తో జోడీ కడుతోంది.

Updated : 24 Dec 2023 10:32 IST

సీనియర్‌ నటి త్రిష చేతి నిండా సినిమాలతో దూసుకెళ్తోంది. ‘లియో’తో భారీ విజయం అందుకున్న తను ‘ఐడెంటిటీ’తో మలయాళ నటుడు టోవినో థామస్‌తో జోడీ కడుతోంది. శనివారం ఆమె ఈ సినిమా చిత్రీకరణలో అడుగు పెట్టింది. హీరోతోపాటు యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొననుంది. ఈ వివరాల్ని తెలుపుతూ ఓ వీడియో క్లిప్‌ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’ అనే వ్యాఖ్య జోడించింది. టోవినో సైతం ఆ వీడియోని షేర్‌ చేసుకుంటూ త్రిషకి స్వాగతం పలికారు. ‘ఐడెంటిటీ’ని అఖిల్‌పాల్‌, అనాస్‌ఖాన్‌లు తెరకెక్కిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని