Urvashi Rautela: పెళ్లంటే రెండు మనసుల కలయిక..: ఊర్వశి రౌతేలా

నటి ఊర్వశీ రౌతేలా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడారు. 

Published : 10 Feb 2024 19:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైన నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela). ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆమె పెళ్లిపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘‘ ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. అది ఇరువైపులా ఉండాలి.  ఇద్దరు వ్యక్తులు పూర్తి అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టాలి. ఎదుటి వ్యక్తిపై నమ్మకం, గౌరవం ఎంతో ముఖ్యం. వివాహ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో జీవితాంతం కలిసి నడుస్తూ బాధ్యతలు నిర్వర్తించాలి’’అని పేర్కొన్నారు.  సీనీ పరిశ్రమలోకి రాకుండా ఉంటే జిమ్నాస్ట్‌, ఏరోనాటికల్‌ ఇంజినీర్‌, లేదా ఐఏఎస్‌ అధికారినో అయ్యేదానినని ఊర్వశీ రౌతేలా మీడియాకు తెలిపారు.  

ఇక ప్రస్తుతం ఈమె బాలకృష్ణ సరసన నటిస్తోన్నారు. ‘#Nbk109’ వర్కింగ్‌ టైటిల్‌తో ఇది తెరకెక్కుతోంది. 1980ల దశకం నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం. దీనిని బాబీ తెరకెక్కిస్తున్నారు. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఊర్వశీరౌతేలా చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’, రామ్‌ ‘స్కంద’, అఖిల్‌ ‘ఏజెంట్‌’, పవన్ కళ్యాణ్‌, సాయి తేజ్‌ల ‘బ్రో’ మూవీల్లో తన డాన్స్‌తో ఆకట్టుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని