Urvashi Rautela: వైద్యానికి సాయం చేస్తే ఫోన్‌ తిరిగి ఇస్తానంటూ ఊర్వశీకి మెయిల్‌

నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) ఇటీవల తన ఐ ఫోన్‌ పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ మెయిల్ వచ్చింది. 

Published : 19 Oct 2023 17:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) అక్టోబరు 14న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు అహ్మదాబాద్‌ వెళ్లారు. మ్యాచ్‌ జరగడానికి కొన్ని నిమిషాల ముందు నరేంద్రమోదీ స్టేడియంలో నుంచి ఆమె కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఆ తరువాత తన 24 క్యారెట్ల గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్న ఊర్వశీ ఫోన్‌ను తిరిగి తెచ్చిన వారికి తగిన బహుమతి ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం తాను సాధారణ ఫోన్‌ వాడుతున్నానని, ‘గోల్డ్‌ ఐ ఫోన్‌’ కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. 

ఐ ఫోన్‌ పోయిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెబుతూ ఊర్వశీ సామాజిక మాధ్యమాల్లో అక్టోబరు 15న పోస్టు పెట్టారు. వీలయినంత త్వరగా ఫోన్‌ను కనిపెట్టేందుకు సాయం చేయమని అందులో కోరారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 16న ఆమెకు ఓ మెయిల్‌ వచ్చింది. ఆ స్క్రీన్‌షాట్‌ను ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. ‘మీ ఫోన్‌ నా దగ్గర ఉంది. మీకు అది కావాలంటే.. మా సోదరుడి క్యాన్సర్‌ చికిత్సకు మీరు సాయం చేయాలన్నది ఆ మెయిల్‌ స్క్రీన్‌షాట్‌ సారాంశం. ఆ ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లుగా ఊర్వశీ ‘థంబ్స్‌అప్‌’ సింబల్‌ పెట్టారు. అయితే, నిజంగా ఫోన్‌ దొరికిందా? మెయిల్‌ చేసిన వ్యక్తి ఎవరు? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. 

రివ్యూ: భగవంత్‌ కేసరి.. బాలకృష్ణ యాక్షన్‌ డ్రామా ఎలా ఉంది?

ఇక ఊర్వశీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుసగా ఐటెమ్‌ సాంగ్స్‌ చేస్తూ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేసిన ఊర్వశీ తాజాగా రామ్‌ ‘స్కంద’ సినిమాలోనూ ‘కల్ట్‌ మామా’ అంటూ అలరించారు. అలాగే అఖిల్ ‘ఏజెంట్’, పవన్ కళ్యాణ్, సాయి తేజ్‌ల ‘బ్రో’ మూవీల్లోనూ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని