Nachindi Girl Friendu: ఒక్కరోజు ప్రేమ కథ

ఉదయ్‌ శంకర్‌ కథానాయకుడిగా గురు పవన్‌ తెరకెక్కించిన చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’. అట్లూరి నారాయణరావు నిర్మాత. జెన్నీఫర్‌ కథానాయిక.

Updated : 05 Nov 2022 14:53 IST

ఉదయ్‌ శంకర్‌ కథానాయకుడిగా గురు పవన్‌ తెరకెక్కించిన చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’. అట్లూరి నారాయణరావు నిర్మాత. జెన్నీఫర్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హీరో వెంకటేష్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. కథ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్‌ అంశాలు ఉన్నాయని తెలిసింది. ఈ చిత్రంతో ఉదయ్‌కు మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘యువతరం మెచ్చే కథతో రూపొందిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు చిత్ర నిర్మాత అట్లూరి నారాయణరావు. హీరో ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక్కరోజులో జరిగే కథ ఇది. అన్ని రకాల భావోద్వేగాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా యువతరానికి బాగా నచ్చుతుంది. వెంకటేష్‌ మా ట్రైలర్‌ను విడుదల చేసి.. మా బృందాన్ని అభినందించడం మాకు కొత్త శక్తిని ఇచ్చింది’’ అన్నారు. ‘‘ఒకరోజులో జరిగే ఈ ప్రేమకథలో చాలా భావోద్వేగాలున్నాయి’’ అంది నాయిక జెన్నీఫర్‌. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్‌, ఛాయాగ్రహణం: సిద్దం మనోహర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని