Vicky Kaushal: హృతిక్‌ను కలవడానికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేశా
మంచి పాట ఏదైన వినిపిస్తే నేల మీద కాలు నిలువదు. అదే పాటకు నచ్చిన వ్యక్తితో కలిసి స్టెప్పులేస్తే ఆ ఆనందమే వేరు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌కు తాజాగా అలాంటి ఆనందమే కలిగింది.
మంచి పాట ఏదైన వినిపిస్తే నేల మీద కాలు నిలువదు. అదే పాటకు నచ్చిన వ్యక్తితో కలిసి స్టెప్పులేస్తే ఆ ఆనందమే వేరు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌కు తాజాగా అలాంటి ఆనందమే కలిగింది. ‘కహో నా..ప్యార్ హై’ చిత్రంలోని ‘ఏక్ పల్ కా జీనా’ పాటకు హృతిక్ రోషన్‌తో కలిసి విక్కీ కౌశల్ చిందులేశాడు. అలా ఆ పాటకి ప్రముఖ హీరోతో కలిసి డ్యాన్స్ చేయడం జీవితంలో ఎప్పటికి ప్రత్యేకమే అని అంటున్నాడు విక్కీ. కొన్ని రోజుల క్రితం అబుదాబిలో జరిగిన అవార్డ్స్ వేడుకలో వీరిద్దరూ హాజరైయ్యారు. ఆ వేడుకలో హృతిక్, విక్కీ కలిసి ‘ఏక్ పల్ కా జీనా’ పాటకు స్టెప్పులేశారు. ‘హృతిక్‌ని చూడాటానికి నేను ‘ఫిజా’ సెట్‌కి తరుచు వెళ్లేవాడిని. అప్పటికి ‘కహో నా..ప్యార్ హై’ సినిమా విడుదలైంది. నేను తనకి వీరాభిమానిని. ఆ పాటకు డ్యాన్స్ చేసే పిల్లలనే హృతిక్ ఎక్కువ కలుస్తాడని ఎవరో అన్నారు. అది నమ్మి ఆయనని కలవడానికి ముందు, మూడు రోజుల పాటు ఆ పాటకు డాన్స్ ప్రాక్టీస్ చేశాను. హృతిక్ చాలా మంచి వ్యక్తి. ఆయనను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు ఒక వ్యకే కాదు, మంచి స్ఫూర్తి కూడా..ఇప్పటికి, ఎప్పటికి... ’అంటూ హృతిక్ రోషన్‌తో కలిసి ఉన్న ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తు తన ఆనందాన్ని, అభిమానాన్ని తెలిపాడు విక్కీ కౌశల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandra babu arrest: తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు: నారా లోకేశ్
-
Drugs Case: ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారు: సినీనటుడు నవదీప్
-
Keerthy suresh: ముంబయి వీధుల్లో ఆటోరైడ్ చేస్తున్న కీర్తి సురేశ్.. వీడియో వైరల్
-
Chandrababu Arrest: తొలి రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ
-
Team India: ర్యాంకులు ముఖ్యం కాదు.. బలమైన జట్లను ఓడిస్తేనే.. ప్రపంచకప్: గౌతమ్ గంభీర్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు