Vignesh Shivan: నన్ను పక్కనపెట్టడానికి అజిత్‌ కారణం కాదు

తన తదుపరి ప్రాజెక్ట్‌తో అజిత్‌తో ఉండటం లేదని స్పష్టం చేశారు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan). ఏకే 62వ ప్రాజెక్ట్‌ను వేరే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని ఆయన చెప్పారు.

Published : 07 Apr 2023 15:37 IST

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ (Ajith)తో ప్రాజెక్ట్‌ నిలిచిపోవడంపై దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ మొదటిసారి పెదవి విప్పారు. ఇందులో అజిత్‌ తప్పు ఏమీ లేదన్నారు.  స్క్రిప్ట్‌ నచ్చకపోవడంతోనే చిత్ర నిర్మాణ సంస్థ తనని ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పించిందని పేర్కొన్నారు. ‘‘అజిత్‌ కుమార్ 62 ప్రాజెక్ట్‌ చేజారడం ఎంతో బాధగా ఉంది. దీనికి అజిత్‌ వైపు నుంచి ఎలాంటి తప్పూ లేదు. నేను రాసిన స్క్రిప్ట్‌ నిర్మాణ సంస్థకు నచ్చలేదు. సెకండాఫ్‌ విషయంలో వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందిస్తున్నా. ఒక అభిమానిగా అజిత్‌ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తా’’ అని విఘ్నేశ్‌ వెల్లడించారు.

అజిత్‌ - విఘ్నేశ్‌ శివన్‌ కాంబోలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్‌ గతేడాది ప్రకటించింది. అజిత్‌ 62వ చిత్రంగా ఇది ప్రచారం పొందింది. ‘తునివు’ రిలీజ్‌ అయ్యాక ఇది పట్టాలెక్కాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల ఇది నిలిచిపోయినట్లు ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అజిత్‌కు స్క్రిప్ట్‌ నచ్చలేదని.. అందుకే, ఇది ఆగిపోయిందని కోలీవుడ్‌ సినీ ప్రియులు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే లైకా ప్రొడెక్షన్స్‌లో అజిత్‌ ఎవరితో సినిమా చేయనున్నారా? అని ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని