vijay devarakonda: విజయ్‌ కోసం మరొకటి

ఈ వేసవిలో ‘ఫ్యామిలీస్టార్‌’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు విజయ్‌ దేవరకొండ. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా పూర్తి కాగానే.. గౌతమ్‌ తిన్ననూరి చిత్రాన్ని తిరిగి మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇవి కాక రవికిరణ్‌ కోలా దర్శకత్వంలోనూ విజయ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. కాగా.. ఇప్పుడాయన కోసం దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ఓ కథ సిద్ధం చేశారని సమాచారం.

Updated : 10 Feb 2024 09:38 IST

వేసవిలో ‘ఫ్యామిలీస్టార్‌’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు విజయ్‌ దేవరకొండ. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా పూర్తి కాగానే.. గౌతమ్‌ తిన్ననూరి చిత్రాన్ని తిరిగి మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇవి కాక రవికిరణ్‌ కోలా దర్శకత్వంలోనూ విజయ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. కాగా.. ఇప్పుడాయన కోసం దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ఓ కథ సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటికే ఇరువురి మధ్య కథా చర్చలు జరిగాయని.. స్క్రిప్ట్‌ నచ్చడంతో రాహుల్‌ సినిమా చేసేందుకు విజయ్‌ సానుకూలంగా ఉన్నారని తెలిసింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గతంలో విజయ్‌ - రాహుల్‌ కలయికలో ‘టాక్సీవాలా’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇది బాక్సాఫీస్‌ ముందు చక్కటి విజయాన్ని అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని