Vishal: ఫైట్‌ సీన్స్‌ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్‌

తాను హీరోగా నటిస్తున్న ‘లాఠీ’ సినిమా చిత్రీకరణలో విశాల్‌ మరోసారి గాయపడ్డారు. ఇంట్రడక్షన్‌ పోరాట దృశ్యాలు షూటింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. సంబంధిత వీడియోను చిత్ర బృందం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పోలీసు అధికారి అయిన విశాల్‌ రౌడీ గ్యాంగ్‌ను అదుపు చేసే సన్నివేశమది.

Published : 05 Jul 2022 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను హీరోగా నటిస్తున్న ‘లాఠీ’ (Laththi) సినిమా చిత్రీకరణలో విశాల్‌ (Vishal) మరోసారి గాయపడ్డారు. ఇంట్రడక్షన్‌ పోరాట దృశ్యాలు షూటింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరగ్గా సంబంధిత వీడియోను చిత్ర బృందం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పోలీసు అధికారి అయిన విశాల్‌ రౌడీ గ్యాంగ్‌ను అదుపు చేసే సన్నివేశమది. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చేస్తూనే విశాల్‌ ఉన్నట్టుండి పడిపోవడంతో సహ నటులంతా షాక్‌ అయ్యారు. ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేసి, ఆయన ఎడమ కాలికి గాయమైనట్టు గుర్తించారు. కాస్త విశ్రాంతి తీసుకున్న అనంతరం విశాల్‌ మళ్లీ చిత్రీకరణలో పాల్గొన్నారు. విశాల్‌ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు మెసేజ్‌లు పెడుతున్నారు.

ఇదే సినిమా చిత్రీకరణలో ఫిబ్రవరిలో తొలిసారి గాయపడ్డారు విశాల్‌. అప్పుడూ యాక్షన్‌ సన్నివేశాల్లో భాగంగానే ప్రమాదానికి గురయ్యారు. ఈ చిత్రాన్ని పవర్‌ఫుల్‌ పోలీసు కథతో దర్శకుడు ఎ. వినోద్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునయన కథానాయిక. రమణ, నంద నిర్మాతలు. ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని