Vishal: ‘లాఠీ’ కోసం.. భారీ యాక్షన్‌

దక్షిణాది చిత్రపరిశ్రమల్లో యాక్షన్‌ ఘట్టాలకు పెట్టింది పేరు.. తమిళ కథానాయకుడు విశాల్‌. చాలా చిత్రాల్లో డూప్‌ లేకుండానే... సాహసాలు చేస్తుంటాడీయన. ఈ సమయాల్లో ఎన్నోసార్లు ఆయన గాయపడ్డారు.

Updated : 16 Apr 2022 08:48 IST

క్షిణాది చిత్రపరిశ్రమల్లో యాక్షన్‌ ఘట్టాలకు పెట్టింది పేరు.. తమిళ కథానాయకుడు విశాల్‌. చాలా చిత్రాల్లో డూప్‌ లేకుండానే... సాహసాలు చేస్తుంటాడీయన. ఈ సమయాల్లో ఎన్నోసార్లు ఆయన గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘లాఠీ’. ఈ చిత్రానికి వినోద్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సునయన కథా నాయిక. ఇందులో విశాల్‌ పోలీసు అధికారిగా కన్పించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్‌లో వచ్చే భారీ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. పీటర్‌ హెయిన్‌ నేతృత్వంలో వందల మంది ఫైటర్స్‌ మధ్య షూటింగ్‌ చేస్తున్నారు. ఈ చిత్రీకరణలో ఓ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు విశాల్‌ స్వల్పంగా గాయపడ్డారు. చిత్రబృందం వెంటనే స్పందించి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఉంచింది చిత్రబృందం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని