Vishwak Sen: అమ్మా.. నీ కుమారుడికి ఏం కాదు.. ఎవ్వరేం చెయ్యలేరు: విశ్వక్ సేన్
‘నా జీవితంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆమె మా అమ్మ. అమ్మా.. నీ కొడుక్కి ఏం కాదు. ఎవ్వరేం చెయ్యలేరు’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు నటుడు విశ్వక్ సేన్. ఆయన...
మోకాళ్లపై కూర్చొని అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన నటుడు
హైదరాబాద్: ‘నా జీవితంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆమె మా అమ్మ. అమ్మా.. నీ కుమారుడికి ఏం కాదు. ఎవ్వరేం చెయ్యలేరు’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు నటుడు విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఓ రహదారిపై ఆయన ప్రాంక్ వీడియోను చేసిన సంగతి తెలిసిందే. ప్రమోషన్ పేరిట న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఓ టీవీ ఛానల్ డిబెట్ నిర్వహించడం.. ఎలాంటి సమాచారం లేకుండా ఆ డిబెట్లో విశ్వక్ పాల్గొని అసభ్య పదజాలం ఉపయోగించడం.. అనంతరం ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పడం.. ఇలా వరుస ఘటనలతో గత రెండు రోజుల నుంచి విశ్వక్ పేరు మార్మొగిపోతుంది. ఈనేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఖమ్మంలో జరిగిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ మాట్లాడాడు.
‘‘అశోకవనంలో అర్జునకల్యాణం’లో అన్నిరకాల భావోద్వేగాలు చక్కగా పండాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అర్జున్కుమార్కి మనలానే భయం, అభద్రతా భావం ఎక్కువ. 33 ఏళ్లపాటు ఎన్నో భయాలు, అభద్రతాభావాలు చూసి.. చివరికి వాటిన్నింటినీ దాటుకుని ఏం చేశాడన్నదే మా సినిమా. దయచేసి మా చిత్రాన్ని మే 6న దగ్గర్లోని థియేటర్లలో వీక్షించండి. ఇప్పటివరకూ నేను చేసింది కేవలం నాలుగు సినిమాలే. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నా. వాటి గురించి ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పాలనుకుంటున్నా. హీరో అవుతా.. సినిమా ఇండస్ట్రీలోకి వెళతా.. అని చెప్పినప్పుడు అందరిలానే మా కుటుంబం కూడా షాకయ్యింది. కానీ, మా అమ్మ మాత్రం మొదటి నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఎంతో కష్టపడి.. డ్యాన్స్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగి.. రూ.12 లక్షలు పెట్టి ‘వెళ్లిపోమాకే’ తీస్తే.. ఓ నిర్మాత మా చిత్రాన్ని కొనుగోలు చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆరోజు బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్నా అనిపించింది. కెరీర్ ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి. సమస్యలెదురైనప్పుడు కూడా చిరునవ్వుతో కనిపించడమే ఎదుగుదలంటే. నన్ను ఎవరో ఏదో అన్నారని, నాకెదో జరుగుతుందని నేనెప్పుడూ బాధపడలేదు. ఇప్పటికే ఇలాంటివి ఎన్నో చూశా. ఇవి నాకేం కొత్త కాదు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చా. వరుస ఘటనల తర్వాత తాజాగా సోషల్‌మీడియాలో #Vishwaksen పేరుతో నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మెస్సేజ్‌లు చూసి.. నేను సంపాదించిన ఆస్తి ఇది. కానీ నాకు ధైర్యాన్ని ఇచ్చింది మీరే’’ అంటూ విశ్వక్ ఉద్వేగానికి లోనయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దేవర’ ఎన్టీఆర్‌కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్‌తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!