Welcome To The Jungle: అందరికీ వెల్‌కమ్‌

‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’...బాలీవుడ్‌లోని ప్రముఖ నటులందరూ ఈ సినిమా కోసం ఏకమై అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు.

Updated : 10 Sep 2023 14:04 IST

‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’...బాలీవుడ్‌లోని ప్రముఖ నటులందరూ ఈ సినిమా కోసం ఏకమై అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. ‘వెల్‌కమ్‌’ ఫ్రాంఛైజీలో వస్తున్న ఈ మూడవ భాగాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే, ఫిరోజ్‌ ఎ. నడియాడ్‌వాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా అక్షయ్‌ కుమార్‌ సినిమా పేరుతో ఉన్న ఒక ప్రత్యేక మ్యూజిక్‌ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘నా పుట్టినరోజున మీ అందరికీ మేము ఇస్తున్న బహుమతి....వెల్‌కమ్‌’ అంటూ వ్యాఖ్యల్ని జోడించారు. బాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని విధంగా కొత్త తరహా కాన్సెప్ట్‌తో 24మంది నటీనటులతో ఉన్న ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో దిశా పఠానీ, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, సంజయ్‌దత్‌ తదితరులు సందడి చేశారు. ‘ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, కుటుంబమంతా ఒకచోట చేరి నవ్వులు పంచుకునేలా చేసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఎప్పుడూ మర్చిపోలేని జ్ఞాపకాలను ఇస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు’ అని అంటున్నాయి సినీ వర్గాలు. పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబరు 20న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని