F 3: ఉర్రూతలూగించే ‘ఎఫ్ 3’ సాంగ్.. ‘ఊ.. ఆ..’ ఫుల్ వీడియో వచ్చేసింది!
ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొన్ని సర్‌ప్రైజ్‌లను అభిమానులకు చిత్ర బృందం అందిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన చిత్రం ‘ఎఫ్ 3’ (F 3). వెంకటేశ్ (Venkatesh), వరుణ్‌తేజ్ (Varun Tej), తమన్నా (Tamannaah), మెహరీన్ (Mehreen Pirzada) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి కొన్ని సర్‌ప్రైజ్‌లను చిత్ర బృందం అభిమానులకు అందిస్తోంది. తాజాగా ‘ఊ.. ఆ.. అహ.. అహ’ (Woo Aa Aha Aha) అంటూ రొమాంటిక్‌గా సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేసింది. ఇందులో తమన్నా మగాడి వేషంలో కనిపించగా తనను ఇష్టపడే అమ్మాయిగా సోనాల్ చౌహాన్ కనిపించింది. ఈ ఇద్దరి మధ్య సాగే కొన్ని డ్యాన్స్ సన్నివేశాలు, వెంకటేశ్- తమన్నా, వరుణ్- మెహరీన్ కలిసి వేసే స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాసర్ల శ్యామ్ రాసిన ఈ హుషారైన పాటను సునిధి చౌహాన్, లవిత లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్ సంయుక్తంగా ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డబ్బు ఇతివృత్తంగా మంచి హాస్యాన్ని పంచిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pawan Kalyan: వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా - జనసేన ప్రభుత్వమే: పవన్ కల్యాణ్
-
Indigo: విమానంలోనూ వృత్తి ధర్మం చాటారు.. చిన్నారి ప్రాణాలు కాపాడారు
-
Mayawati: ఆ కూటములతో కలిసే ప్రసక్తే లేదు: మాయావతి
-
Nightclub Fire: నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి
-
Nimmagadda: ప్రజాస్వామ్యం బలహీన పడేందుకు అంతర్గత శత్రువులే కారణం: నిమ్మగడ్డ
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు