Yami Gautam: యాస మాట్లాడటానికి చాలా కష్టపడ్డా

‘‘దస్వీ’ నా  కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం. చిత్రీకరణ ఆద్యంతం మేము నవ్వుతూనే గడిపాం. ఈ చిన్ని క్షణాలు షూటింగ్‌   అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా.. చిరస్మరణీయంగా మార్చాయి’’ అంది నటి యామి గౌతమ్‌. అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా నటించిన చిత్రమిది. తుషార్‌ జలోట తెరకెక్కించారు

Updated : 01 Apr 2022 14:37 IST

‘‘దస్వీ’ నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం. చిత్రీకరణ ఆద్యంతం మేము నవ్వుతూనే గడిపాం. ఈ చిన్ని క్షణాలు షూటింగ్‌   అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా.. చిరస్మరణీయంగా మార్చాయి’’ అంది నటి యామి గౌతమ్‌. అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా నటించిన చిత్రమిది. తుషార్‌ జలోట తెరకెక్కించారు. జియో స్టూడియోస్‌తో కలిసి దినేష్‌ విజన్‌ నిర్మించారు. యామి గౌతమ్‌, నిమ్రత్‌ కౌర్‌ కీలక పాత్రల్లో నటించారు. జైలులో ఉండి పదోతరగతి పూర్తి చేసిన గంగారామ్‌ అనే గ్రామీణ రాజకీయ నాయకుడి కథగా ఈ సినిమా సాగుతుంది. ఇది ఈనెల 7న ప్రముఖ ఓటీటీ వేదికలు జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లలో నేరుగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్‌  అనుభవాలను ఓ జాతీయ మీడియాతో పంచుకుంది యామి గౌతమ్‌. ‘‘నేనిందులో జ్యోతి దేస్వాల్‌ అనే పోలీస్‌ అధికారిణిగా కనిపిస్తా. చాలా బోల్డ్‌ అండ్‌ స్ట్రిక్ట్‌ క్యారెక్టర్‌గా ఉంటుంది. నటిగా నాకెంతో సవాల్‌గా నిలిచిన పాత్ర ఇది. ఈ పాత్ర కోసం హర్యాన్వి యాసలో సంభాషణలు పలికేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇందుకోసం నేను ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. ఈ సినిమా కోసం తొలిసారి జైలులో షూటింగ్‌ చేయడం మర్చిపోలేని అనుభవం. గంగారామ్‌ పాత్రలో అభిషేక్‌ నటన నన్ను విస్మయానికి గురిచేసింది. ఆ పాత్ర కోసం తనెంతో కష్టపడ్డాడు. ఆ పాత్రని తుషార్‌ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు’’ అని యామి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె హిందీలో ‘ఓ మై గాడ్‌2’తో పాటు ‘లాస్ట్‌’, ‘ధూమ్‌ ధామ్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని