Yami Gautam: తల్లి కాబోతున్న యామీ.. కొత్త సినిమా ట్రైలర్‌ లాంచింగ్‌ ఈవెంట్‌లో ప్రకటించిన నటి

నటి యామీ గౌతమ్‌ తల్లి కానున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Published : 08 Feb 2024 19:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెలివిజన్‌లో ప్రకటనలతో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు నటి యామీ గౌతమ్‌ (Yami Gautam)‌. ఆ తర్వాత అల్లు శిరీష్‌ ‘గౌరవం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాలతో అలరిస్తోన్న యామీ తాజాగా తన అభిమానులకు తీపి కబురు చెప్పారు. తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించారు. ‘ఉరి’ సినిమాతో ‘ఉత్తమ దర్శకుడి’గా జాతీయ అవార్డు అందుకున్న ఆదిత్యధర్‌తో కలిసి ఆమె ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే.

తన తాజా చిత్రం ‘ఆర్టికల్‌ 370’ ట్రైలర్‌ లాంచింగ్‌ ఈవెంట్‌లో యామీ దంపతులు ఈ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం తను ఐదో నెల ప్రెగ్నెంట్‌ అని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే విషయం తెలిసిందని తన భర్త సహకారంతో షూటింగ్ పూర్తి చేశానని చెప్పారు. ‘చిత్రీకరణ సమయంలో ఈ విషయం తెలిశాక చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ ఆదిత్య నాకెంతో ధైర్యాన్నిచ్చాడు. తను నా పక్కన లేకపోతే దీన్ని పూర్తి చేసేదాన్ని కాదేమో. అలాగే చిత్ర బృందమంతా నన్నెంతో జాగ్రత్తగా చూసుకున్నారు’ అంటూ యామీ ఆనందం వ్యక్తంచేశారు.

అలాంటి వాళ్లను వెనక్కి లాగొద్దు.. విజయ్ పొలిటికల్‌ ఎంట్రీపై ఉపాసన కామెంట్స్‌..

‘ఆర్టికల్‌ 370’ సినిమా విషయానికొస్తే.. ఆదిత్య సుహాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్టికల్‌ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే దీని టీజర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌గా యాక్షన్‌ అవతారంలో కనిపిస్తూ ఆకట్టుకోనుంది యామీ. జియో స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈనెల 23న ఈ చిత్రం విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని