
కెనడాలో ఘనంగా ‘తాకా’ సంక్రాంతి సంబరాలు
టొరంటో: తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. జనవరి 15న టొరంటోలోని శృంగేరి కమ్యూనిటీ సెంటర్ (ఎస్వీబీఎఫ్ ఫౌండేషన్)లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. తొలుత తాకా అధ్యక్షులు కల్పనా మోటూరి, అనిత సజ్జ, సీత శ్రావణి పొన్నలపల్లి జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొవిడ్ సమయంలో తాకా చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలను కల్పనా మోటూరి వివరించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి ఆహ్వానించి సంక్రాంతి ప్రాముఖ్యతను వివరించారు. 20కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, కళా నృత్యాలు, సినిమా పాటలు, డ్యాన్సులతో దాదాపు 4 గంటల పాటు ఈ వేడుకలు ఉల్లాసంగా జరిగాయి. అనంతరం తెలుగు తిధులు, నక్షత్రాలకు అనుగుణంగా రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ ముంద్రణకు సహకరించిన రాకేశ్ గరికపాటి, ప్రసన్న తిరుచిరాపల్లికి కల్పనా మోటూరి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ప్రస్తుత, మాజీ కార్యవర్గ సభ్యులను మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, మహమ్మద్ ఖాజిల్, విద్య భావనం, రేణు కుందెమ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ సంక్రాంతి వేడుకల విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జునాచారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్మోహన్‌రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్లు అనిత సజ్జ, గణేశ్ తెరల, రాణి మద్దెల, ట్రస్టీ ఛైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ్ అల్లం, సురేశ్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, వ్యవస్థాపక ఛైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, లోకేశ్ చిల్లకూరు, రమేశ్ మునుకుంట్ల, రాకేశ్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరి తదితరులను కల్పనా మోటూరి అభినందించారు. ప్రసన్న తిరుచిరాపల్లి వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.