AP News: సిట్‌ కార్యాలయం వద్ద పత్రాల దహనం.. హెరిటేజ్‌ సంస్థవేనంటూ తెదేపా ఆరోపణ

తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశారు.

Updated : 08 Apr 2024 12:36 IST

అమరావతి: తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. వీటిని తగలబెట్టడాన్ని పలువురు స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారు. ఆ వీడియోలను తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి తెస్తోంది.

సీఐడీ చీఫ్‌ రఘురామ్‌రెడ్డి ఆదేశాల మేరకు పత్రాలు తగలబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. హెరిటేజ్‌ సంస్థ కీలక పత్రాలు సహా ఇతర దస్త్రాలు అందులో ఉన్నట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌ ఆదేశాలతో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సిట్‌ అక్రమ కేసులను పెట్టిందని చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం కోసం సీఐడీ అనేక మందిపై ఒత్తిడి చేసిందని తెలిపారు. అనుమతులు లేకుండా పలు దస్త్రాలు ఎలా వచ్చాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇటీవల ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని నిలదీశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని