Revanth reddy: ప్రమాణం చేస్తా.. భారాస, కేసీఆర్ నుంచి డబ్బు తీసుకోలేదు: రేవంత్‌రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. భారాస, కేసీఆర్ నుంచి తాను డబ్బు తీసుకోలేదని.. ఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్‌దేనని స్పష్టం చేశారు.
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ భారాస నుంచి డబ్బు తీసుకున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్‌దేనని ఆయన స్పష్టం చేశారు. భారాస, కేసీఆర్ నుంచి తాను డబ్బు తీసుకోలేదని చెప్పారు. ఈటల దిగజారి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నానని అన్నారు. ఈ మేరకు మీడియాతో రేవంత్ మాట్లాడారు.
‘‘పార్టీలోని అన్ని వర్గాల నాయకులను.. ఏఐసీసీ కార్యదర్శులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కల సమక్షంలో కార్యకర్తల నుంచి సమకూర్చుకున్నాం. మునుగోడు ఉప ఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలు సమకూర్చిందే. సహాయం అందించిన వారిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. నేను భారాస నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. భాజపా విశ్వసించే భాగ్యలక్ష్మి ఆలయంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు వచ్చి ప్రమాణం చేస్తా. ఏ ఆలయంలోనైనా తడిబట్టలతో ప్రమాణం చేయడానికి నేను సిద్ధం’’ అని రేవంత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు