అప్పుడే ధోనీ అంటే ఏంటో అర్థమైంది: ఆర్పీ

క్రికెట్‌ను అర్థం చేసుకోవడం, అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి మించిన వారుంÙడరు. వికెట్ల వెనుక కీపింగ్‌ చేస్తూనే బ్యాట్స్‌మన్‌ కదలికల్ని గమనించి వారు...

Published : 23 Aug 2020 03:01 IST

2007 టీ20 ఫైనల్‌ను గుర్తుచేసుకున్న మాజీ పేసర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ను అర్థం చేసుకోవడం, అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి మించిన వారుంÙడరు. వికెట్ల వెనుక కీపింగ్‌ చేస్తూనే బ్యాట్స్‌మన్‌ కదలికల్ని గమనించి వారు ఆడే ఆటతీరును ఇట్టే అర్థం చేసుకుంటాడు. దీంతో వారి వికెట్లు తీసేందుకు బౌలర్లకు విలువైన సూచనలు చేసి ఎన్నోసార్లు జట్టుకు ఉపయోగపడ్డాడు. ఈ మాటలను స్వయంగా అతడితో కలిసి ఆడిన బౌలర్లే అనేక సందర్భాల్లో చెప్పారు. తాజాగా మాజీ పేసర్‌ ఆర్పీసింగ్‌ ఓ క్రీడా వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ అలాంటి విషయమే చెప్పాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ చెప్పినట్లు చేయడం వల్లే తాను‌ పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ కమ్రన్‌ అక్మల్(0) వికెట్‌ తీయగలిగానని‌ తెలిపాడు. దాంతో మహీ అంటే సాధారణ ఆటగాడు కాదనే విషయం తెలిసొచ్చిందని పేర్కొన్నాడు. 

‘2007 పొట్టి ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ అంటే ఏంటో తెలిసింది. అతడో ప్రత్యేకమైన ఆటగాడని అనిపించింది. ఆ టోర్నీలో అతడు బ్యాటింగ్‌తో అదరగొట్టకపోయినా ప్రతీ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో కమ్రన్‌ అక్మల్‌ బ్యాటింగ్‌కు వచ్చాక క్రీజులో కాలు కదపడం లేదని గమనించి ధోనీ నాకు చెప్పాడు. అప్పుడు మిగతా విషయాలు మర్చిపోయి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తే అక్మల్‌ను బౌల్డ్‌ చేయొచ్చని నాతో అన్నాడు. అప్పటికే నేను వేరే ఫీల్డింగ్‌ సెట్‌ చేయమని అడిగినా అతడొప్పుకోలేదు. నాకు నచ్చచెప్పి వికెట్‌ తీసే విధంగా బంతులేయమన్నాడు. అలానే బౌలింగ్‌ చేయడంతో ఆ పాక్‌ బ్యాట్స్‌మన్‌ వెంటనే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అలా బ్యాట్స్‌మన్‌ కదలికల్ని అర్థం చేసుకునే విషయంలో ధోనీ అద్భుతమైన ఆటగాడని తెలిసింది’ అని ఆర్పీ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు