అలాంటి విషయాల్లో ప్రజలే ముందుకు రావాలి

బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య లాంటి సామాజిక అంశాలపై క్రికెట్‌ ప్రముఖులు ఎందుకు స్పందించరో తాను అర్థం చేసుకోగలనని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మాజీ క్రికెటర్‌...

Published : 11 Aug 2020 15:06 IST

మనోజ్‌ తివారి 

ఇంటర్నెట్‌డెస్క్‌: ñబాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య లాంటి సామాజిక అంశాలపై క్రికెట్‌ ప్రముఖులు ఎందుకు స్పందించరో తాను అర్థం చేసుకోగలనని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి వ్యాఖ్యానించాడు. తాజాగా స్పోర్ట్స్‌కీడాతో ఫేస్‌బుక్‌ లైవ్‌లో అతడు మాట్లాడాడు. ఇలాంటి సామాజిక అంశాల్లో ప్రముఖులు స్పందించకపోతే ప్రజలు ఆశ్చర్యపోతారని చెప్పాడు. అలాగే తనను కూడా సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్‌ చేసి వాటిపై స్పందించమని కోరతారని చెప్పాడు. అయితే, ఏ ఒక్కరి కోసమో తాను నోరు విప్పనని స్పష్టంచేశాడు. అలాగే సామాజిక అంశాలపై స్పందించాలా వద్దా అనేది వారి వ్యక్తిగతమని పేర్కొన్నాడు.

‘అలాంటి విషయాల్లో ప్రజలే ముందుకు రావాలి. క్రికెటర్ల నుంచి అభిమానులు ఎన్నో ఆశిస్తారు. కేవలం మైదానంలో ఆడి వెళ్లిపోతే సరిపోదు. ఇలాంటి వాటిపై ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని కోరుకుంటారు’ అని తివారి అన్నాడు. మరోవైపు ఇలాంటి వాటిపై  చాలా మంది ప్రముఖులకు స్పందించాలని ఉన్నా ఎందుకు బయటకు రారో అర్థం చేసుకోగలనని చెప్పాడు. అనవసర వివాదాల్లో ఇరుక్కోకూడదని భావించడంతో వారు స్పందించడం లేదని అభిప్రాయపడ్డాడు. తాను మాత్రం అలా కాదని, అవసరాన్ని బట్టి స్పందిస్తానని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని