BAN vs AFG: బంగ్లాదేశ్‌కు మరోసారి షాకిచ్చిన అఫ్గానిస్థాన్‌

బంగ్లాదేశ్‌కు అఫ్గానిస్థాన్‌ మరోసారి షాకిచ్చింది. తొలి వన్డేలో డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం బంగ్లాదేశ్‌పై 17 పరుగుల తేడాతో గెలుపొందిన అఫ్గాన్‌ జట్టు.. తాజాగా రెండో వన్డేలో 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

Updated : 08 Jul 2023 23:05 IST

చట్‌గావ్‌: బంగ్లాదేశ్‌కు అఫ్గానిస్థాన్‌ మరోసారి షాకిచ్చింది. తొలి వన్డేలో డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం బంగ్లాదేశ్‌పై 17 పరుగుల తేడాతో గెలుపొందిన అఫ్గాన్‌ జట్టు.. తాజాగా రెండో వన్డేలో 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. రెహ్మనుల్లా గుర్భాజ్‌ (145; 125 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్ (100; 119 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) శతకాలతో వీరవిహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గానిస్థాన్‌ 331/9 భారీ స్కోరు సాధించింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 189 పరుగులకే కుప్పకూలింది. ముస్తాఫిజుర్ రెహ్మన్‌ (69; 85 బంతుల్లో) ఒక్కడే పోరాడాడు. షకీబ్‌ అల్ హసన్ (25), హసన్‌ మిరాజ్‌ (25), లిటన్ దాస్‌ (13), తౌహిద్ (12) పరుగులు చేయగా.., నజ్ముల్ హుస్సేన్ శాంటో (1), మహ్మద్‌ నయీమ్‌ (9) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫజల్‌ హక్‌ ఫారూఖీ (3/22), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (3/40), రషీద్‌ ఖాన్ (2/28) బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. మూడో వన్డే జులై 11న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని