రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్‌ చెప్పలేదు.. 

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఎంతో కష్టపడి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు ఓటమి అంచున నిలిచిన...

Published : 23 Jan 2021 13:25 IST

సిడ్నీ టెస్టు డ్రాలో అనూహ్య ఘటన..

ఇంటర్నెట్‌డెస్క్‌: బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఎంతో కష్టపడి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు ఓటమి అంచున నిలిచిన జట్టును హనుమ విహారి(23*), రవిచంద్రన్‌ అశ్విన్‌(39*) ఆదుకున్నారు. వీరిద్దరూ 259 బంతులు ఎదుర్కొని కడదాకా క్రీజులో నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. దాంతో భారత్‌ ఓటమి నుంచి తప్పించుకుంది. అయితే.. ఆరోజు ఆటలో అశ్విన్‌, విహారి మాత్రమే కీలకం కాదని, శార్దూల్‌ ఠాకుర్‌ కూడా అంతే ముఖ్య పాత్ర పోషించాడని తాజాగా తెలిసింది.

సిడ్నీ టెస్టు చివరి రోజు అశ్విన్‌‌, విహారి బ్యాటింగ్‌ చేస్తుండగా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి.. శార్దూల్‌ ద్వారా వారికి ఒక సందేశం పంపాడని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ అన్నారు. తాజాగా అశ్విన్‌‌తో ముచ్చటించిన సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర విషయం వెల్లడించారు. అయితే, ఆ సందేశం ఏంటో శార్దూల్‌ తమకు చెప్పలేదని అశ్విన్‌ పేర్కొన్నాడు. శాస్త్రి.. డ్రింక్స్ సమయంలో శార్దూల్‌ను పిలిచి విహారిని ధాటిగా ఆడమని, మరో ఎండ్‌లో అశ్విన్‌ను వికెట్‌ కాపాడుకోమని చెప్పమన్నారని శ్రీధర్‌ వివరించారు. కానీ, శార్దూల్‌ తమ వద్దకొచ్చి.. ‘డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా విషయాలు చెప్పమని చెప్పారు. కానీ నేనేం చెప్పను. అవన్నీ వదిలేయండి. మీరు బాగా ఆడుతున్నారు. ఇలాగే కొనసాగండి’ అని చెప్పాడని అశ్విన్‌ అసలు విషయం స్పష్టం చేశాడు.

ఇవీ చదవండి..
చిరకాల కోరిక నెరవేర్చుకున్న సిరాజ్‌..!
‘ఏం కావాలంటే అది చేసుకోండి.. మేం వెళ్లం’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని