AUS vs BAN: మిచెల్ మార్ష్ 177 నాటౌట్.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 11 Nov 2023 18:21 IST

పుణె: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ రెండే వికెట్లు కోల్పోయి 44.4 ఓవర్లలో ఛేదించింది. మిచెల్ మార్ష్‌ (177*; 132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. అతడు 87 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. స్టీవ్ స్మిత్ (63*; 64 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (53; 61 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్‌, ముస్తాఫిజుర్ రెహ్మన్‌కు తలో వికెట్ దక్కింది. 

బంగ్లా బ్యాటర్లలో తౌహిద్‌ హృదౌయ్‌ (74; 59 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నజ్ముల్ హొస్సేన్ శాంటో (45) రాణించారు. తాంజిద్ హసన్ (36), లిట్టన్ దాస్ (36), మహ్మదుల్లా (32), మెహదీ హసన్ మిరాజ్ (29), ముష్పీకర్ రహీమ్ (21) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 2, సీన్ అబాట్ 2, మార్కస్ స్టాయినిస్ ఒక వికెట్ పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు