Cheteshwar Pujara: పుజారా మరో ఘనత.. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్లో నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డు

టీమ్‌ఇండియా బ్యాటర్ ఛెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 

Published : 21 Jan 2024 22:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) మరో ఘనత సాధించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో 20 వేల పరుగులు సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ తెందూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ ఉన్నారు. రంజీ ట్రోఫీలో విదర్భతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు 19,904 పరుగులతో ఉన్న పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 43, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసి ఈ ఫీట్‌ను అందుకున్నాడు. 

భారత్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసింది వీరే

  • సునీల్ గావస్కర్ (25,834 పరుగులు.. 348 మ్యాచ్‌లు) 
  • సచిన్ తెందూల్కర్ (25,396 పరుగులు.. 310 మ్యాచ్‌లు) 
  • రాహుల్ ద్రవిడ్ (23,794 పరుగులు.. 298 మ్యాచ్‌లు)
  • ఛెతేశ్వర్ పుజారా (20,013 పరుగులు.. 260 మ్యాచ్‌లు)

రంజీ ట్రోఫీలో అదుర్స్‌.. టీమ్‌ఇండియాలో రీ ఎంట్రీ ఇస్తాడా?

టీమ్‌ఇండియాలో తిరిగి చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్న పుజారా రంజీ ట్రోఫీలో నిలకడగా ఆడతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఝార్ఖండ్‌పై అజేయంగా 243 పరుగులు చేసిన అతడు రెండో మ్యాచ్‌లోను హరియాణాపై 49, 43 పరుగులు చేశాడు. గతేడాది జరిగిన టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌లో నిరాశపర్చడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌లో సైతం రెండు టెస్టులకు జట్టును ప్రకటించగా సెలెక్టర్లు పుజారాకు మొండి చేయి చూపారు. రంజీలో ఇదే నిలకడ ప్రదర్శిస్తే ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు అతడిని ఎంపిక చేసే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు