‘అఫ్గాన్‌ క్రికెట్‌కు అంతరాయం కలిగించబోం’

 ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల కారణంగా ఆ దేశ క్రికెట్‌ భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, ఇంతకు ముందే షెడ్యూల్‌ ఖరారు చేసిన మ్యాచులు ఆడేందుకు అంతరాయం కలిగించబోమని తాలిబన్లు స్పష్టం చేశారు. 

Published : 01 Sep 2021 01:22 IST

స్పష్టం చేసిన తాలిబన్లు

ఇంటర్నెట్ డెస్కు: ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల కారణంగా ఆ దేశ క్రికెట్‌ భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, ఇంతకు ముందే షెడ్యూల్‌ ఖరారు చేసిన మ్యాచులు ఆడేందుకు అంతరాయం కలిగించబోమని తాలిబన్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబరులో అఫ్గానిస్థాన్‌ జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ ఆడుతుందని తాలిబన్‌ సాంస్కృతిక కమిషన్‌ డిప్యూటీ హెడ్‌ అహ్మదుల్లా వసీఖ్‌ పేర్కొన్నారు. ‘భవిష్యత్తులో అన్ని దేశాలతో మేం సత్సంబంధాలు  ఏర్పరచుకోవాలనుకుంటున్నాం. అప్పుడే, అఫ్గాన్‌ ఆటగాళ్లు విదేశాలకు, విదేశీ ఆటగాళ్లు అఫ్గాన్‌కు రాగలుగుతారు’ అని ఆయన అన్నారు. 

మరోవైపు నవంబరులో ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జరుగనున్న చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ‘క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ), అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) మధ్య సత్సంబంధాలున్నాయి. ఇరు జట్లు కలిసి కచ్చితంగా టెస్టు మ్యాచ్‌ ఆడతాయి. దాని తర్వాత దుబాయిలో జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కూడా అఫ్గాన్‌ జట్టు పాల్గొంటుంది’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు