David Warner: వన్డే క్రికెట్‌కు గుడ్‌బై.. మెలిక పెట్టిన డేవిడ్‌ వార్నర్

ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తాజాగా వన్డేల నుంచి కూడా నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించాడు.

Updated : 01 Jan 2024 09:23 IST

David Warner | సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. భారత్‌పై వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు సోమవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. వార్నర్‌ ఇప్పటికే టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈవారం పాకిస్థాన్‌తో జరగనున్న ఫైనల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ అతని కెరీర్‌లో చివరిది.

అయితే, 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను పునరాగమనం చేస్తానని వార్నర్‌ (David Warner) చెప్పడం గమనార్హం. మరోవైపు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. టెస్టు, వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని పేర్కొన్నాడు. తన క్రికెట్‌ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌ కీలక పాత్ర పోషించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చడంలో వార్నర్‌ (David Warner) కీలక పాత్ర పోషించాడు. రెండు శతకాలు, రెండు అర్ధశతకాలతో సహా మొత్తం 528 పరుగులు చేశాడు. జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

వార్నర్‌ వన్డే కెరీర్‌ గణాంకాలు..

  • మ్యాచ్‌లు- 161
  • పరుగులు- 6,932
  • సగటు- 45.3
  • అత్యధిక స్కోర్‌- 179
  • స్ట్రైక్‌ రేట్‌- 97.26
  • ఫోర్లు- 733
  • సిక్సులు- 130
  • శతకాలు- 22
  • అర్ధశతకాలు- 33
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని