- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
David Warner: ఫలితం రాకపోయినా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు: వార్నర్
ఇంటర్నెట్‌డెస్క్: గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో దిల్లీ ఈ సీజన్‌లో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. దీంతో ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగపూరితమైన పోస్టు పెట్టాడు. ఈ సీజన్‌లో తనకు అవకాశం ఇచ్చిన దిల్లీ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు.
‘దిల్లీ శిబిరంలో నన్నూ, నా కుటుంబాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు చూపించిన ప్రేమా ఆప్యాయతలకు ఎంతో రుణపడి ఉంటాం. మమ్మల్ని మీ కుటుంబంలా చూసుకున్నందుకు సంతోషం. అయితే, మనం ఆశించిన ఫలితం రాకపోయినా వ్యక్తిగతంగా ఆటగాళ్లూ, సహాయక సిబ్బంది, కోచ్‌లు, ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ తప్పుల నుంచి నేర్చుకొని తిరిగి బలంగా రావడమే. ఇక అభిమానులారా మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ ఆప్యాయతలు లేకపోతే మేం చేయాలనుకున్నది చేయలేం. మీరు ఆశించిన విధంగానే మైదానంలో ఆడాలనుకుంటాం. మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తాలనుకుంటాం. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తాం. వచ్చే సీజన్ వరకూ మీరంతా క్షేమంగా ఉండండి’ అని దిల్లీ జట్టు బృందంతో దిగిన ఫొటోను పంచుకున్నాడు. కాగా, వార్నర్ ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 48 సగటుతో ఐదు అర్ధ శతకాలు సాధించి మొత్తం 432 పరుగులు చేశాడు. దీంతో అత్యధిక పరుగుల బ్యాట్స్‌మెన్ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
-
Movies News
Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
-
World News
Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
-
General News
అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
-
India News
CBI searches: రూ.11కోట్ల నాణేలు అదృశ్యం.. 25చోట్ల సీబీఐ సోదాలు
-
Politics News
Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
- Thiru review: రివ్యూ: తిరు
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం