AUS vs PAK: పాక్‌తో తొలి టెస్టులో వార్నర్‌ సెంచరీ.. షహీన్‌ బౌలింగ్‌లో స్కూప్‌ సిక్స్‌ హైలైట్‌!

టెస్టు క్రికెట్‌ వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన ఆసీస్‌ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) తన చివరి సిరీస్‌లో అదరగొట్టేస్తున్నాడు. 

Updated : 14 Dec 2023 17:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) క్రికెట్‌ షాట్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మైదానం నలువైపులా షాట్లు కొట్టేస్తాడు. తాజాగా పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లోనూ తన మార్క్‌ షాట్లతో విజృంభించాడు. పాక్‌ స్టార్ పేసర్ షహీన్‌ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌ మాత్రం అతడి ఇన్నింగ్స్‌కే హైలైట్‌. మిడిల్‌ స్టంప్‌ను టార్గెట్‌ చేస్తూ షహీన్‌ వేసిన ఫుల్లర్‌ బంతిని బ్యాక్‌ఫుట్‌ వేసి ఫైన్‌ లెగ్‌మీదుగా సిక్స్‌గా మలిచాడు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

పెర్త్‌ వేదికగా పాకిస్థాన్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో వార్నర్ (164: 211 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ శతకం సాధించాడు. తన కెరీర్‌లో ఇదే చివరి సిరీస్‌ అని ఇప్పటికే ప్రకటించిన వార్నర్ చెలరేగిపోయాడు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. క్రీజ్‌లో మిచెల్ మార్ష్‌ (15*), అలెక్స్‌ కేరీ (14*) ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని