Sachin: జిమ్‌లో పడుకున్నప్పుడు సచిన్‌ వచ్చాడు.. అప్పుడు ఏమైందంటే?: డెవాల్డ్ బ్రెవిస్‌

క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్‌ని మొదటిసారి కలిసి విషయాన్ని దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ గుర్తు చేసుకున్నాడు. భారత టీ20 లీగ్‌ 2022లో ముంబయి జట్టు సభ్యుడిగా ఉన్న బ్రెవిస్‌.. తాను జిమ్‌లో నేలపై పడుకున్నప్పుడు సచిన్

Published : 06 Jun 2022 01:50 IST

(Photo: Dewald Brevis Instagram)

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్‌ని మొదటిసారి కలిసిన విషయాన్ని దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ గుర్తు చేసుకున్నాడు. భారత టీ20 లీగ్‌ 2022లో ముంబయి జట్టు సభ్యుడిగా ఉన్న బ్రెవిస్‌.. తాను జిమ్‌లో నేలపై పడుకున్నప్పుడు సచిన్ అకస్మాత్తుగా వచ్చాడని చెప్పాడు. ఆ క్షణంలో సచిన్‌తో ఏం మాట్లాడాలో తనకు అర్థం కాలేదని పేర్కొన్నాడు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో 506 పరుగులు చేసి ‘బేబీ డివిలియర్స్‌’గా గుర్తింపు తెచ్చుకున్నాడు డెవాల్డ్ బ్రెవిస్. ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రూ.20 లక్షల ధరతో వేలంలోకి వచ్చిన బ్రెవిస్‌ని  రూ.3 కోట్లకు ముంబయి జట్టు దక్కించుకుంది. ముంబయి తరఫున 7 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ క్రికెటర్‌ 142.48 స్ట్రెక్‌రేట్‌తో 161 పరుగులు చేశాడు.

‘నేను జిమ్‌లో నేలపై పడుకున్నాను. తలుపు వద్ద అకస్మాత్తుగా సచిన్ కనిపించాడు. నాకు ఏమి చేయాలో తోచలేదు. మొదటిసారి అతనితో కరచాలనం చేయడం అద్భుతంగా అనిపించింది. నేను సచిన్‌ను ఎంతగానో గౌరవించాను. అతడు నేర్పించిన చిన్న టెక్నికల్‌ పాఠాలు నాకు ప్రత్యేకమైనవి. సచిన్‌, కోచ్ మహేల జయవర్ధనే వంటి దిగ్గజాల నుంచి నేర్చుకోవడం నా అదృష్ణం’ అని డెవాల్డ్ బ్రెవిస్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని